పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33వ అధ్యాయము.

మానవులలో భిన్న వర్గములు.

621. తమయందలి సత్వరజస్తమోగుణముల ఆధిక్యతను బట్టి మానవులు భిన్నభిన్నగుణములు కలవారుగనుందురు.

622. జీవులన్నియు ఒక్కతరువే; కాని వానివాని దశాంతరములనుబట్టి నాలుగురకములుగ నుండును.

(1) బద్ధజీవులు :- బంధనమున నున్నవి.

(2) ముముక్షులు :- బంధనమును తొలగించుకొనవలయునని తీవ్రప్రయత్నములు చేయునవి.

(3) ముక్త జీవులు :- బంధనమునుండి తప్పించుకొనినవి.

(4) నిత్యముక్తజీవులు :- బంధనమున చిక్కకయే సదా స్వచ్ఛతోనున్నవి.

623. పూర్ణములపై పూత వరిపిండియే; కాని లోపలిపూర్ణము వేఱుగానుండును. పూర్ణముయొక్క మంచిచెడ్డలు లోపలి పదార్థము ననుసరించి యుండును. అటులనే నరులందఱి శరీరములును ఒకేరకము పదార్థములతో నేర్పడినను వారి హృదయముయొక్క పవిత్రతా తారతమ్యమునుబట్టి వేర్వేఱు గుణములుగలవారుగ నుందురు.

624. మానవులు తలగడదిండ్ల గలేబులవంటివారు. ఒక గలేబు ఎఱ్ఱగా నుండవచ్చును. యింకొకటి నీలముగా నుండ