పుట:Shodashakumaara-charitramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

షోడశకుమారచరిత్రము


ములును నాయుర్వేదమును ధనుర్వేదంబు
        భరతశాస్త్రంబును బంచబాణ
శాస్త్రంబు కామందచాణక్యభార్గవ్య
        కౌణపదంతముఖ్యప్రదీప
భూపాలనయశాస్త్రములు శిల్పిశాస్త్రంబుఁ
        గావ్యము ల్లక్షణగ్రంథములును
నాటకంబులు నర్హనానాకళాప్ర
పంచమును నలవడఁగ శీలించి దుష్ట
కుంజరరథాధిరోహణకుశలుఁ డై ని
రూఢిఁ జెన్నొందె మిగులంగఁ బ్రౌఢి మెఱసి.

34


వ.

నవయౌవనంబు నొందుసమయంబున జనమేజయజననాథుండు రాజకుమారానీకశేఖరుం డగు శతానీకుని నిజరాజ్యంబునకు నభిషిక్తునిం జేసి యక్కమలాకరకుమారునకు యౌవరాజ్యపట్టంబు గట్టి సమస్తంబు నప్పగించి తానును దేవీద్వయంబును దపోవనంబున కరిగిన.

35


క.

లోకోన్నతగరిమ శతా
నీకుఁడు రాజ్యం బొనర్ప నెమ్మిని యువరా
జై కమలాకరుఁ డురువిభ
వాకరుఁడై యనుదినంబు నన్నం గొలుచున్.

36


సీ.

అంగహీనతయును హరవిరోధము మాని
        కనుపట్టు మకరకేతనుఁ డనంగ
వనవాసమును గృష్ణవర్ణత్వమును మాని
        విలసిల్లు నిందిరావిభుఁ డనంగ