పుట:Shodashakumaara-charitramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

11


బడుగుఁజందంబును నొడలికందును మాని
        సంపూర్ణరుచినొప్పు చంద్రుఁ డనఁగ
ఘనపిధానంబును ఖరకరత్వము మాని
        తనువుమైఁ నుపొందు తపనుఁ డనఁగ
రూపతనుకాంతి లక్ష్మీప్రతాపమహిమ
లఖిలవర్ణనీయంబులై యతిశయిల్ల
యౌవనోజ్జ్వలతరమూర్తి నంద మొందు
నఖిలకమలాకరుఁడు కమలాకరుండు.

37


మ.

జగదానందవిహార హారమకుటచ్ఛత్రాదిసంపన్న ప
న్నగభూషార్పితభావ భావజకళానైపుణ్య పుణ్యక్రియా
సుగమాచారగభీర భీరహితతేజోదీవ్యమానక్షమా
గగనాభోగదీశాంత శాంతమదరాగద్వేషగర్వోదయా.

38


క.

ఆఖ్యానకల్పితకథో
పాఖ్యానాఖ్యాయికాప్రపంచరహస్య
వ్యాఖ్యానవ్యవహరణ
ప్రఖ్యాతచరిత్ర వికచపంకజనేత్రా.

39


మాలిని.

శమదమగుణమోదీ శైవసిద్ధాంతవేదీ
సముచితనయబుద్ధీ సంచితైశ్వర్యసిద్ధీ
యమనియమధురీణా యజ్ఞకర్మప్రవీణా
శమితదురితవేగా సాధితాష్టాంగయోగా.

40


గద్యము.

ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబునందుఁ బ్రథమాశ్వాసము.