పుట:Shodashakumaara-charitramu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

141


వ.

అని చింతించి యనంతరంబ యొక్కతెఱంగు గాంచి శూన్యలింగంబున ఛాగరక్తాభిషేకంబును దన్మాంసపూజనంబును నరబలియు నొనర్చిన జ్వరశాంతి యగునఁట మున్నొకజోగిణిచే వింటి నని యశోకకలికతో నరబలిప్రకారంబు చెప్పక తక్కినవిధంబు చెప్పి శివలింగస్థానంబునకుం దోకొని చని యేమఱించి వధియించి యీయాపద నిర్వహించెద నని నిశ్చయించి యప్పొలంతితోడం జెప్పవలయు వార్తలు చెప్పి ప్రతీహారపాలాధ్యక్షుం డగు వృద్ధు రావించి.

118


సీ.

వసుమతీశ్వరునకు జ్వరము మానంగ ర
        క్షావిధికృత్యముల్ సలుపవలయు
నర్ధరాత్రమునప్పుఁ డాఁడువా రెవ్వరు
        వెడలివచ్చిన నడ్డుపడకుఁ డనుచుఁ
జెప్పి పోవఁగఁ బంచి చెలియును దానును
        ఛాగపూజాద్రవ్యచయము గొనుచు
ససిహస్తయై శూన్యవారగృహమ్మున కేగి
        యజరక్తమజ్జనం బాచరించి
యయ్యతివ శంభుపూజ సేయంగఁ బంచి
తత్పరతఁ బూజ యొనరించుదానిఁ జేరి
తద్గళము వేయుటయు హేతి ధారదప్పి
దైవవశమున నడ్డంబు దాఁకుటయును.

119


వ.

అశోకకళికయు బెగ్గిలి యగ్గలంపు హాహారవంబు లెసంగ గుడి వెడలి పఱవందొడంగిన.

120


క.

తలయును జీరయు వీడఁగ
ఖలుబూతము వోలె వెంటఁ బడి చనుదేరం