పుట:Shodashakumaara-charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

షోడశకుమారచరిత్రము


నుపరిభాగసాపితోజ్జ్వలరత్నంబు
        లలతితారకముల గలసి బెరయఁ
బ్రమదకేళీలోలబాలముఖేందులు
        చంద్రబింబంబుతో సరసమాడఁ
గనకరత్నవిభాసఘనచంద్రశాలలు
        ఖచరవిమానసంఘములఁ గలయఁ
జారుమౌక్తికమణిమయతోరణముల
బహుమనోహరచిత్రసంపదల మహిత
విభవములతోడ నెంతయు విస్తరిల్లు
సురపురం బన హస్తినాపురవరంబు.

5


చ.

అమరులకంబం దత్పురి ధరామరవల్లభు లెక్కుడంట త
థ్యము తలపోయ నాగమవిధానములై తనరాగు తారు ని
త్యము నొనరించు దానముల యజ్ఞములం బరితృప్తిఁ బొంది సం
భ్రమమునఁ దేలి వారు వడిఁ బ్రస్తుతిసేయఁగఁ బెంపుఁజెందుటన్.

6


క.

రాలెల్లను రత్నంబులు
చేలెల్లను రాజనంబుఁ జెఱకును బౌర
స్త్రీలెల్లఁ బద్మినులు పురి
శ్రీలను నుతియింప వశమె శేషున కైనన్.

7


సీ.

గిరులఱెక్కలు ద్రుంచి గిరిభేది భూమిపైఁ
        గ్రుమ్మరుఁ డనిన మేల్కొండ లనఁగ
హరుఁ డొకగజమూర్తి నణఁచుట నీసుచే
        బహుగజాకృతులమైఁ బరఁగె ననఁగ