పుట:Shodashakumaara-charitramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

షోడశకుమారచరిత్రము

ప్రథమాశ్వాసము

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన కథాకల్పవల్లికామతల్లికకు నాలవాలం బగుహస్తినాపురం బెట్టిదనిన.

1


గీ.

ఆది..............ప్పురమునం
గాఁపురంబుండఁగాఁ జూడఁ గడలి వచ్చి
కోటసొరరాక కూతుపైఁ గూర్మిఁ జుట్టు
వారియున్నట్టు లొప్పారి పరిఖ మెఱయు.

2


గీ.

అక్షయఖ్యాతి నెంతయు నందమంది
యమలకమలోదయస్థాన మనఁగ వెలసి
కువలయప్రియహేతువై కొమరుమీఱి
యలరు నప్పురిపరిఖ దుగ్ధాబ్ధిభంగి.

3


గీ.

మహితసన్మార్గవర్తనమాన్యు లనఁగఁ
బొలుచు నినరాజకవిగురుబుధులనైనఁ
దగులువడఁ జేయు పెంపునఁ దనరు వీటి
కోటకొమ్మలు తారకాస్ఫోటనములు.

4


సీ.

ధామాద్భుతోద్దామహేమకుంభంబులు
        తరణిమండలముతోఁ దడఁబడంగ