పుట:Saundarya-Lahari.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

73


పురారాతేరన్తఃపురమసి తతస్త్వచ్చరణయో
స్సపర్యామర్యాదా తరళకరణానామసులభా,
తథా హ్యేతే నీతాశ్శతమఖముఖాస్సిద్ధిమతులాం
తవ ద్వారోపాన్తస్థితిభిరణిమాద్యాభిరమరాః. 95

టీ. హేభగవతి = ఓయంబా, త్వం = నీవు, పురారాతేః = శివునకు, అన్తఃపురం = అంతఃపురము (పట్టపుదేవివి), అసి = అయితివి. తతః = అందువలన, త్వచ్చరణయోః = నీపాదములయొక్క, సపర్యామర్యాదా = పూజావిధి, తరళకరణానామ్ = చపలచిత్తులకు, అసులభా = సులభముగాదొరకునదికాదు, తథాహి = అదియట్లేగదా, ఏతే = ఈ, శతమఖముఖాః = ఇంద్రుఁడు లోనగు, అమరాః = దేవతలు, తవ = నీయొక్క, ద్వారోపాన్తస్థితిభిః-ద్వార = వాఁకిలియొక్క, ఉపాంత = చెంతను, స్థితిభిః = ఉనికిగల, అణిమాద్యాభిః = అణిమాదిసిద్ధులచేతనే, అతులామ్ = తులలేని, సిద్ధిమ్ = మనోరథసిద్ధిని, నీతాః = పొందింపఁబడిరి.

తా. తల్లీ, నీవు శివునిపట్టపురాణివిగనుక నీపాదసేవ కొంచెముతో దొరకునదికాదు. అందువల్లనే యింద్రాది దేవతలు నీవాఁకిట కావలియున్న యణిమాదిసిద్ధులచేతనే తృప్తినొందుచున్నారు. చంచలచిత్తులు గనుక సిద్ధులతోనే తృప్తినొంది శాశ్వతమగు పరమపదమును గోరరు.

కళత్రం వైధాత్రం కతికతి భజన్తే న కవయః
శ్రియో దేవ్యాః కోవా న భవతి పతిః కైరపి ధనైః,
మహాదేవం హిత్వాః తవ సతి సతీనామచరమే
కుచాభ్యామాసఙ్గః కురవకతరోరవ్యసులభః. 96

టీ. హేసతి = ఓపార్వతీ, వైధాత్రమ్ = బ్రహ్మసంబంధమైన, కళత్రం = భార్యయగు సరస్వతిని, కతికతి = ఎందఱెందరు, కవయః = కవులు, నభజన్తే = సేవించరు (సేవింతురు), కోవా = ఏపురుషుఁడైనను, కైరపి = కొన్నియగు, ధనైః = ధనములచేత, శ్రియః దేవ్యాః = లక్ష్మీదేవికి, పతిః = అధిపతి,