పుట:Saundarya-Lahari.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

సౌందర్యలహరి


తన్వీ = కృశించినదియు, ఉరసిజారోహ విషయే = కుచదేశమునను, పిఱుఁదుల యందును, పృథుః = మిగులగొప్పదియు, అరుణా = ఒడలెల్ల ఎఱ్ఱనైన, కాచిత్ = అనిర్వాచ్యరూపముగల, శమ్భోః = సదాశివునియొక్క, కరుణా = దయ (కరుణారూపశక్తి), జగత్ = లోకమును, త్రాతుం = కాపాడుకొఱకై, విజయతే = అన్నిటికి మిన్నయై వెలయుచున్నవి.

తా. తల్లీ, కేశములయందు వంకరయై నవ్వునందు సుకుమారమై మనముగ మృదులమై స్తనప్రాంతమున కఠినమై నడుమున కృశించినదై, స్తనముల యందును పిఱుఁదులయందును మిగుల గొప్పదై యెఱ్ఱనైన శివునికరుణారూప మైన యొక యనిర్వాచ్యమహిమగలశక్తి వెలయుచున్నది.

కళఙ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం
కళాభిః కర్పూరైర్మరకతకరణ్డం నిబిడితమ్,
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయోభూయో నిబడయతి నూనం తవ కృతే. 94

టీ. హేభగవతి = ఓదేవీ, కళఙ్కః = చిహ్నము, కస్తూరీ = మృగమదము, రజనికరబిమ్బం = చంద్రబింబము, జలమయం = ఉదకస్వరూపమై, కళాభిః = కిరణములనే, కర్పూరైః = కప్పురములతోడ, నిబిడితం = నిండించఁబడిన, మరకతకరణ్డం = మరకత (మొసలినోటినుండిపుట్టిన) మణులతోఁ జేయఁబడినపెట్టె, అతః = ఇందువలన, ప్రతిదినం = అనుదినము, త్వద్భోగేన = నీవు వాడుకొనుటచేత, రిక్తకుహరం-రిక్త = వట్టిపోయిన, కుహరం = అంతరము గలిగిన, ఇదం = ఈపెట్టియను, విధిః = బ్రహ్మ, భూయోభూయః = మాటిమాటికి, తవకృతే = నీకొఱకయి, నిబిడయతి = పూరించుచుండును, నూనం = నిజము.

తా. తల్లీ, ఈయగపడునది కళంకముగాదు కస్తూరి. ఇది చంద్రుని బింబముగాదు ఉదకము, ఈతెల్లనివి కిరణములుగావు కర్పూరసమూహముచే నింపఁబడినపెట్టె. దీనియందలివస్తువులను నీవు దినదినము వాడుకొందువు గనుకనే బ్రహ్మ యెప్పుడును దీనిని మరల ఈ వస్తువులచే నింపుచుండును.