పుట:Saundarya-Lahari.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

సౌందర్యలహరి


తులాం-కఠిన = బిరుసైన, కమఠీ = తాఁబేలుయొక్క, కర్పర = వీఁపుబొచ్చెతోడ, తులాం = పోలికను, కథం = ఏలాగున, నీతం = పొందించఁబడినది, ఉపయమనకాలే = వివాహకాలమున, పురభిదా = ఈశ్వరునిచేత, యత్ = ఏపాదము, దయమానేన = దయగల, మనసా = చిత్తముతో, ఉభాభ్యామ్ = రెండగు, పాణిభ్యాం = చేతులతో, అదాయ = ఎత్తి, దృషది = సన్నెకంటియందు, కథంవా = ఎటులు, న్యస్తం = ఉంచఁబడినది.

తా. తల్లీ, కీర్తికినెలవై సంకటములను బారఁదోలు కుసుమసుకుమారమగు నీపాదమును మహాకవులు క్రూరముగా తాఁబేటిబొచ్చెతో నెట్లుపోల్చిరో తెలియదు. వివాహకాలమందు శంకరుఁడు తాను దయగలవాఁడయ్యు రెండుచేతులతోఁబట్టి యెట్లుసన్నెకంటి (నూఱుడుఱాయి) ని నొక్కించెనో తెలియదు. ఈరెండును కఠినపుఁబనులే యని భావము.

నఖైర్నాకస్త్రీణాం కరకమలసఙ్కోచశశిభి
స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చణ్డి చరణౌ
ఫలాని స్వస్స్థేభ్యః కిసలయకరాగ్రేణ దధతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. 89

టీ. హేచణ్డి = ఓపార్వతీ, దరిద్రేభ్యః = బీదలకొఱకు, భద్రాం = పుష్కలమైన, శ్రియం = లక్ష్మిని, అనిశం = ఎల్లపుడు, అహ్నాయ = శీఘ్రముగా, దక్షతౌ = ఇచ్చుచున్న, తే = నీయొక్క, చరణౌ = పాదములు, నాకస్త్రీణాం = దేవవనితలయొక్క, కరకమలసఙ్కోచశశిభిః-కర = హస్తముల నే, కమల = తామరపూవులయొక్క, సఙ్కోచ = ముకుళింపఁజేయుటయందు, శశిభిః = చంద్రులైన (దేవిపాదదర్శనమైనతోడనే దేవాంగనలు అంజలి ఘటింతురు), నఖైః = గోళ్ల చేత, స్వస్స్థేభ్యః = స్వర్గమందున్న (సర్వసంపత్సమృద్ధిగల) దేవతలకొఱకు, ఫలాని = కోరినవస్తువులను, కిసలయకరాగ్రేణ-కిసలయ = చిగురుటాకులనే, కర = హస్తములయొక్క, అగ్రేణ = కొనలచేత, దదతాం = ఇచ్చుచున్న, దివ్యా