పుట:Saundarya-Lahari.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

సౌందర్యలహరి


వెన్నెలలయొక్క, జాలం = బృందమును, పిబతాం = త్రాగుచున్న, చకోరాణాం = వెన్నెలపులుఁగులకు, అతిరసతయా = ఎక్కువ మధురమగుటచే, చఞ్చుజడిమా-చఞ్చు = ముక్కులయందు, జడిమా = అరుచి, ఆసీత్ = కలిగెను, అతః = ఇందువలన, తే = ఆపిట్టలు, ఆమ్లరుచయః = పుల్లనిరుచిగల, శీతాంశోః = చంద్రునియొక్క, అమృతలహరీం = అమృతప్రవాహమును, కాంజికథియా = పులికడుగనుతలంపుతో, స్వచ్ఛన్దం = ఇచ్చకొలఁది, నిశినిశి = ప్రతిరాత్రియందును, జ్యోత్స్నాసు = వెన్నెలలయందు, భృశం = తనివారఁగా, పిబన్తి = త్రాగుచున్నవి.

తా. తల్లీ, చకోరపక్షులు నీముఖచంద్రుని యందలి చిఱునగవులనెడి వెన్నెలలనుద్రావి యవి యతిమధురమగుటచే నోరు చవిచెడ నింతకంటె పుల్లనైన చంద్రునివెన్నెలను పుల్లని కడుగునీ ళ్లనుభ్రమచే ప్రతిరాత్రియందును కడుపారఁ ద్రావి వెగటును బాపుకొనుచున్నవి.

అవిశ్రాన్తం వత్యుర్గుణగణకథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా,
యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్ఛచ్ఛవిమయీ
సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా. 64

టీ. హేజనని = ఓయమ్మా, జపాపుష్పచ్ఛాయా-జపాపుష్ప = దాసనపూవుయొక్క, ఛాయా = రంగువంటి రంగుగల, తవ = నీయొక్క, సా = ఆ, జిహ్వా = నాలుక, అవిశ్రాన్తం = తెఱిపిలేనట్లు, పత్యుః = భర్తయగు నీశ్వరునియొక్క, గుణగణకథామ్రేడనజపా-గుణ = త్రిపురములఁ గాల్చుట మున్నగు గుణములయొక్క, గణ = సమూహములయొక్క, కథా = గాథలయొక్క, ఆమ్రేడన = పలుమాఱువర్ణించుటయే, జపా = జపముగాఁగలదై, జయతి = అన్నిటికి మిన్నయైయున్నది, యదగ్రాసీనాయాః = ఏ నాలుక యెదురఁగూర్చున్న, సరస్వత్యాః = పలుకుఁజెలియొక్క, స్ఫటికదృషదచ్ఛచ్ఛవిమయీ = స్ఫటికమువలె తెల్లనికాంతిగల, మూర్తిః = ఆకారము, మాణిక్యవపుషా-మాణిక్య = పద్మరాగముయొక్క, వపుషా = రూపముతో, పరిణమతి = మాఱుచున్నదో.