పుట:Saundarya-Lahari.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

51

తా. తల్లీ, నీ యానాలుక జపాపుష్పమువలె నెఱ్ఱనిదై యెల్లపుడు భర్తగుణములను బొగడుచు వెలయుచున్నది. ఏనాలుకముందరఁ గూర్చున్న సరస్వతి తెల్లనిమే నెఱ్ఱనై పోవుచున్నదో, తా నెఱ్ఱగానుండుటగాక దగ్గఱనున్నవానినిఁగూడ ఎఱ్ఱబఱచునంతటి యెఱుపుగలదని తా.

రణే జిత్వా దై త్యానపహృతశిరస్త్రైః కవచిభి
ర్నివృత్తైశ్చణ్డాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః,
విశాఖేన్ద్రోవేన్ద్రైశ్శశివిశదకర్పూరశకలా
విలీయన్తే మాతస్తవ వదనతామ్బూలకబళాః. 65

టీ. హేమాతః = ఓతల్లీ, రణే = యుద్ధమందు, దైత్యాన్ = రక్కసులను, జిత్వా = జయించి, అపహృతశిరస్త్రైః-అపహృత = మ్రొక్కుటకై తీయఁబడిన, శిరస్త్రైః = పాగాలుగలిగిన, కవచిభిః = జీరాలుగలిగిన, నివృత్తైః = యుద్ధమునుండిమరలిన, చండాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః-చండాంశ = చండేశ్వరునిభాగమగు, త్రిపురహర = శివునియొక్క, నిర్మాల్య = పూజించి పరిహరించిన వస్తువులయందు, విముఖైః = పరాఙ్ముఖులైన, విశాఖేన్ద్రోపేన్ద్రైః = కుమారస్వామి ఇంద్రుఁడు విష్ణువు వీరలచేత, శశివిశదకర్పూరశకలాః-శశి = చంద్రునివలె, విశద = తెల్లనైన, కర్పూర = కప్పురముయొక్క, శకలాః = ముక్కలుగలిగిన, తవ = నీయొక్క, వదనతాంబూలకబళాః-వదన = ముఖమందలి, తాంబూల = విడియముయొక్క, కబళాః = పిడచలు, విలీయన్తే = సమసిపోవుచున్నవి.

తా. తల్లీ, కలన నసురులఁ గెల్చివచ్చి పాగాలు వీడఁదీసి నీకుమ్రొక్కుచున్న కవచధరులైన చండేశ్వరునిచే ననుభవింపఁదగినశివనిర్మాల్యము నొల్లనికుమార విష్ణుదేవేంద్రులచేత, తెల్లనికర్పూరపు తునుకలచేఁ గూడిన నీ సగము నమిలిన విడియములు ఖర్చుచేయఁబడుచున్నవో, అనఁగా దేవియనుగ్రహముచే విజయమును గాంచి వచ్చినవీరల కవి తా నిచ్చునని తా.