పుట:Saundarya-Lahari.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

41


హరాహిభ్యో భీతా సరసిరుహసౌభాగ్యజయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిస్సకరుణా.    51

టీ. హేజనని = ఓతల్లీ, తే = నీయొక్క, దృష్టిః = చూపు, శివే = భర్తయగుసదాశివునియందు, శృఙ్గారార్ద్రా-శృఙ్గార = శృంగారరసముచేత, ఆర్ద్రా = తడిసినది, తదితరజనే = ఆశివునికంటె వేఱైన ప్రాకృతజనమందు, కుత్సనపరా = ఏవగింపుగలది, (సపత్న్యాం = సవతియగు,) గఙ్గాయాం = గంగయందు, సరోషా = కోపముతోఁగూడినది, గిరిశనయనే-గిరిశ = శివునియొక్క, నయనే = ఫాలనేత్రమందు, విస్మయవతీ = ఆశ్చర్యముగలది, హరాహిభ్యః-హర = శివునియొక్క, అహిభ్యః = సొమ్ములగు పాములవలన, భీతా = భయమొందినది, సరసిరుహసౌభాగ్యజయినీ-సరసిరుహ = కమలముయొక్క, సౌభాగ్య = సౌందర్యమును, జయినీ = జయించునది, సఖీషు = చెలులయందు, స్మేరా = వికాసముగలది, మయి = నాయందు, సకరుణా = దయతోఁగూడినది.

తా. తల్లీ, నీచూపు శివునియందు శృంగారముగలదై, ఇతరజనముయెడ బీభత్సముగలదై, గంగయందు కోపము (రౌద్రరసము) గలదై, శివునిఫాలనేత్రమందు అద్భుతరసముగలదై, శివుని యొడలి సర్పములయందు భయానకరసముగలదై, ఎఱ్ఱని కాంతిగలిగి కమలశోభను జయించునదియై (వీరరసముగలదై), చెలికత్తియలయందు హాస్యరసముగలదై, నాయందు కరుణారసముగలదై, యిట్లు సర్వరసాత్మకమై వెలయుచుండును.

గతే కర్ణాభ్యర్ణం గరుతి ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణఫలే,
ఇమే నేత్రే గోత్రాధరపతికులోత్తంసకలికే
తవాకర్ణాకృష్టస్మరశరవిలాసం కలయతః.      52

టీ. హేగోత్రాధరపతికులోత్తంసకలికే = కొండలకురాజగు హిమవంతునివంశమునకు శిరోభూషణమగు మొగ్గయగు నోదేవీ, తవ = నీయొక్క, ఇమే = ఈ నాహృదయమందుఁ బొడకట్టుచున్న, నేత్రే = కనులు, కర్ణాభ్యర్ణం =