పుట:Saundarya-Lahari.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

సౌందర్యలహరి


చెవులచెంతను, గతే = పొందినవై, గరుతఇవ = ఈఁకలవలె,పక్ష్మాణి = ఱెప్పవెండ్రుకలను, దథతీ = ధరించుచున్నవై, పురాంభేత్తుః = త్రిపురనాశకుఁడైన యీశ్వరునియొక్క, చిత్తప్రశమరసవిద్రావణఫలే-చిత్త = మనస్సునందలి, ప్రశమరస = శాంతరసముయొక్క, విద్రావణ = చీల్చి నాశమొందించుటయే, ఫలే = ప్రయోజనముగాఁగలవై, (ఇనుపములుకులుగలవనిధ్వని) ఆకర్ణాకృష్టస్మరశరవిలాసమ్-ఆకర్ణ = చెవికొనలవఱకు, ఆకృష్ట = లాగఁబడిన, స్మరశర = మదనబాణములయొక్క, విలాసమ్ = సొబగును, కలయతః = అనుకరించుచున్నవి.

తా. వలిమలకూఁతురగు నోదేవీ, నాహృదయమునఁదోఁచు నీయీకనులు చెవికొనలనుబొంది ఈకెలవలె ఱెప్పవెండ్రుకలనుదాల్చి, శివునిశాంతమును బాడొనర్చి శృంగారమును మొలిపించినవై చెవికొనలదనుక లాగఁబడిన బాణములసౌరు ననుకరించుచున్నవి.

విభక్తత్రైవర్ణ్యం వ్యతికలితలీలాఞ్జనతయా
విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే,
పునస్స్రష్టుం దేవాన్ ద్రుహిణహరిరుద్రానుపరతాన్
రజస్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. 53

టీ. హే ఈశానదయితే = శివునిప్రియురాలగు ఓదేవీ, ఇదం = ఈ, త్వన్నేత్రత్రితయం- త్వత్ = నీయొక్క, నేత్ర = కనులయొక్క, త్రితయం = తీగ, వ్యతికలితలీలాఞ్జనతయా -వ్యతికలిత = పెట్టఁబడిన, లీలా = సొగసుకొఱకైన, అఞ్జనతయా = కాటుకగలదగుటచేత, విభక్తత్రైవర్ణ్యం-విభక్త = వేఱుచేయఁబడిన, త్రైవర్ణ్యం = (తెలుపు, నలుపు, ఎఱుపు) మూఁడురంగులుగలిగినదై, ఉపరతాన్ = ఆత్మయందు లీనులైన, దేవాన్ = క్రీడించు స్వభావముగల, ద్రుహిణహరిరుద్రాన్ = బ్రహ్మవిష్ణుమహేశ్వరులను, పునః = మఱల, స్రష్టుం = సృజించుటకొఱకు, రజఃసత్వంతమఇతి = రజస్సు, సత్వము, తమస్సు అనెడు, గుణానాం = గుణములయొక్క, త్రయం = మూఁటిని, బిభ్రదివ = భరించుచున్నదివలె, విభాతి = మెఱయుచున్నది.