పుట:Saundarya-Lahari.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

21

టీ. హేభగవతి = ఓతల్లీ, ధాతా = బ్రహ్మ, జగత్ = లోకమును, సూతే = పుట్టించుచున్నాఁడు, హరిః = విష్ణువు, జగత్ = లోకమును, అవతి = రక్షించుచున్నాఁడు, రుద్రః = శివుఁడు, జగత్ = లోకమును, క్షపయతే = నశింపఁజేయుచున్నాఁడు, ఈశః = ఈశ్వరుఁడు, ఏతత్ = ఈహరిహరబ్రహ్మాత్మకమైన మూఁటిని, తిరస్కుర్వన్ = తిరస్కరించువాఁడై, స్వమపి = తనదగు, వపుః = శరీరమును, తిరయతి = అంతర్ధానమును బొందించుచున్నాఁడు, సదాపూర్వః = సదాశబ్దము ముందుగల, శివః = సదాశివుఁడు, తదిదమ్ = ఆయీధాతృహరిహర ఈశరూపమైన తత్త్వచతుష్టయమును, క్షణచలితయోః = క్షణవికాసముగల, తవ = నీయొక్క, భ్రూలతికయోః = కనుబొమలయొక్క, ఆజ్ఞామ్ = ముదలను, అవలమ్బ్య = పొంది, అనుగృహ్ణాతి = అనుగ్రహించుచున్నాఁడు. అనఁగా మఱల సృజించునని భావము.

తా. తల్లీ, బ్రహ్మ లోకములను సృజించును, విష్ణువు రక్షించును, శివుఁడు లయింపఁజేయును. ఈశ్వరుఁడుఈముగ్గురను తనశరీరముతోడ లయము నొందించును. సదాశివుఁడు నీకటాక్షమాత్రమును సహాయముగాఁ బడసి యీతత్త్వచతుష్టయమును మఱల నుద్ధరించుచున్నాఁడు. అనఁగా ననేకకోటి బ్రహ్మాండములను సృజించుటయందును లయించుటయందును నీభ్రూవిక్షేపమే సదాశివునకు సహాయమొనర్చునని తా.

త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్పూజా పూజా తవ చరణయోర్యా విరచితా,
తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తంసమకుటాః. 25

టీ. హే శివే = ఓదేవీ, త్రిగుణజనితానామ్ = సత్వరజస్తమోగుణములవలనఁ బుట్టిన, త్రయాణాం = మువ్వురగు, దేవానాం = హరిహరబ్రహ్మలకు, తవ = నీయొక్క, చరణయోః = పాదములయందు, యాపూజా = ఏపూజ, విరచితా = చేయఁబడినదో, సైవ = అదియే, పూజా = పూజయనఁబడును. తథాహి = ఆలాగేకదా, హి = ఏకారణమువలన, ఏతే = వీరలు, త్వత్పాదోద్వహనమణి