పుట:Saundarya-Lahari.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

సౌందర్యలహరి


పీఠస్య = నీపాదములను మోయుచున్నపలకయొక్క, నికటే = చెంతను, శశ్వత్ =మాటిమాటికి, ముకుళితకరోత్తంసమకుటాః-ముకుళిత = అంజలిబద్ధములైన, కర = చేతులే, ఉత్తంస = శిరోభూషణములుగాఁగల, మకుటాః = ఔదలలుగలవారై, స్థితాః = ఉందురో.

తా. తల్లీ, సత్త్వరజస్తమోగుణజనితులైన హరిహరబ్రహ్మలకు నీకుఁ జేయఁబడుపూజయే పూజయనఁబడును, ఏకారణమువలన వీరలెప్పుడును, నీపాదసమ్ముఖమున నిలచియుందురో.

విరిఞ్చిః పంచత్వం ప్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్,
వితంద్రీ మాహేన్ద్రీవితతిరపి సమ్మీలితదృశా
మహాసంసారే౽స్మిన్విరహతి సతి త్వత్పతిరసౌ. 26

టీ. విరఞ్చిః = బ్రహ్మ, పఞ్చత్వం = మరణమును, వ్రజతి = పొందుచున్నాఁడు, హరిః = విష్ణువు, విరతిం = ఉపరతిని, ఆప్నోతి = పొందుచున్నాఁడు, కీనాశః = జముఁడు, వినాశం = నాశమును, భజతి = పొందుచున్నాఁడు, ధనదః = కుబేరుఁడు, నిధనం = మరణమును, యాతి = పొందుచున్నాఁడు, మహేన్ద్రీ = ఇంద్రులసంబంధమైన, వితతిరపి = సమూహమున్ను, సమ్మీలితదృశా = మూయఁబడినకనులతో, వితన్ద్రీ = విహ్వలమగుచున్నది, అస్మి౯ = ఈ, మహాసంసారే = గొప్పసంసారమందు, సతి = దేవీ, అసౌ = ఈ, త్వత్పతిః = నీప్రియుఁడగు సదాశివుఁడు, విహరతి = క్రీడించుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మాదులకును మరణమును గలిగించు నీమహాసంసారమున నీప్రియుఁడగు సదాశివుఁడొకఁడుమాత్రము చలనములేక కనులుమూసికొని వేడుకతోఁ గ్రీడించుచుండును.

జపో జల్పశ్శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతివిధిః,
ప్రణామస్సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. 27