ఈ పుట అచ్చుదిద్దబడ్డది
73
శశికళ
కలాప్రపూర్ణుడు రాకా చంద్రుడు
కళానిలయ ఆతారక చేరేరీతిని
ఉదయం సాయం సంధ్యలలో
పదవిన్యాసము నృత్య గతులలో
ఉషా రమణిలా తుషారార్ద్రవై
పుషితారుణ రాగ ప్రపుల్లవు
నువు పయనించితె ! నీవెనకాలే
దివమణి సూర్యుడనై నే వెన్నాడితినే !
నువు పరుగిడితివి నువు ప్రవహిస్తివి
సవసవ నీకౌ నాడెను దేవీ
పడతీ నినునే పరుగులపట్టితి
పకపక నవ్వుతు నను జేరితివే
బ్రతుకున ఒకటై నువ్వూ నేనూ
పవన హృదయమున పరిమళమౌతూ
పయనమైతిమే పరమ శోభకై.