పుట:Sasi Kala, Adavi Bapiraju.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శశికళ
74
 

కారణము


ఎవరు నేనీ జగతి
ఎవరు నేనీ ప్రగతి

              అవధి మించిన కాంక్ష
              అందుకొను నా స్వగతి.

జవమూను నా కలలు
జగమేని దరియునా

              సొగలు పొగలై బ్రతుకు
              సోలినది నీమ్రోల.

ఆశయము వలదేని
ఆవ లేమున్నదో

              ఆలయము కలదేని
              ఆవలీవల నిజము.

బ్రతుకె ఒక యోగమై
వితములను మది కలుపు

              సతియె అవధికి రూపు
              కారణము నీ వలపు.