ఈ పుట అచ్చుదిద్దబడ్డది
97
శశికళ
సొగసు ... వయసు
ఆసొగసె నీ సోయగమె దేవీ
ఆవయసు నీ హోయలుకావే !
చిట్టిపాపగ నేను చిందులాడిన వయసు
నట్టింట నలుగురూ నన్ను ముద్దిడుసొగసు
ఆసొగసె నీ సోయగమె దేవీ
ఆవయసు నీ హోయలెకావే !
పుట్టుతూ కేరుమని పొంగిపోయిన వయసు
తొట్టిలో శిశువునై తొక్కులాడిన సొగసు
ఆసొగసె ఆహోయలె దేవీ
నీ సోయగము వయసుకావే !
చిలకపందిరి చూస్తు కిలకిలను నావయసు
కులుకుతూ రంగుబొమ్మల నాడు నాసొగసు
ఆసొగసె ఆహోయలెదేవీ
నీ సోయగము వయసుకావే !