పుట:SamardaRamadasu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

వివాహము

ఉపదేశమైనది మొదలుకొని నారాయణుడు నిరంతర ధ్యానపరుడై విరాగివలె నుండును. అతని నడతవలన నతడు లోకవాంచలమీద నాశ విడచినట్లు సంసారసంభందమైన యురులలో దగులుకొన నిష్టమిలేనట్ట్లు గనపడెను. నారాయణుడు బ్రహ్మచర్యమునందే కాలము గడపదలచెను. గాని వృద్ధురాలైన యతని తల్లి తనకుమారుశడు బ్రహ్మచారియై యుండుటకు యిష్టపడక త్వరగా వానికి వివాహముజేసి యొకయింటివానినిజేయదలచెను. ఆగ్రామ పురోహితులు కూడ వాని తల్లిమాటనే యాడి పెండ్లిచేసుకొమ్మనిరి. సాధారణముగ బురోహితులు పెండ్లియీడుగల మగపిల్లలకు ఆడపిల్లలకు బెండ్లిచేయుటయే పనిగాపెట్టుకొందురు గదా! తల్లియుబంధువులు మిత్రులు నారాయణుని గృహస్తాశ్రమమున బ్రవేశపెట్టుటకు బట్టుపట్టిరి. అతని మనస్సు రెండుతలంపుల నడుమ నియ్యాలలూగ జొచ్చెను. మాతృవాక్య పరిపాలన చేయవలెనా? తనమనోభీష్ట ప్రకారము సంసారపరిత్యాగము చేయవలెనా? యను సంశయ మతని మనస్సును బీడింప జొచ్చెను. అతనికి మాతృదేవతయన్న మిక్కిలి భక్తి. సంసారపరిత్యాగము చేయవలెనన్న మాతృభక్తి బంధము గోసివేయవలెను.అది యతని కిష్టములేదుshy amulet. ఏదిఎట్లైనను నాయణుడు వివాహవిముఖుడౌటకే నిశ్చయించు కొనెను. అది అతని జీవితములో మిక్కిలి సమస్య. అంతకంత కా సమస్య మూతిబిగిసి పోయెను. బంధుమిత్రులు పలుమారు నారాయణుని గలిసికొని వివాహమాడుమని నొక్కి చెప్ప దొడగిరి. ఈబాధపడలేక నారాయణు డొకనాడు గ్రామము వెలుపల్ నున్న యెత్తైన యొక వృక్షమెక్కి దాని కొమ్మల నడుమ గూర్చుండి తన సమీపమునకు వచ్చి వివాహము మాట యెత్తిన వారిమీద