పుట:Sakalaneetisammatamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అరయఁగఁ బిన్ననాఁట సిరియాళుఁడనై యెలఁబ్రాయమందు సుం
దరుఁడును నంబినై పదను దప్పిన గుండయగారిచందమై
ధరఁ జరియింపఁ గల్గినఁ దథాస్తు వృథాపరిపాకరూపదు
ష్కరజననం బిదేమిటికిఁ గాలుపనే శివదేవధీమణీ.

అనుపద్యములును, సకలనీతిసమ్మతమున నుదాహృతము లగు 144, 179, సంఖ్య గల పద్యములు పురుషార్థసారమునుండియు బాలబోధమునఁ దత్కర్త యుదాహరించె.

కామందకము సంస్కృతముననుండి కొండ్రాజు వేంకటాద్రి నరేంద్రున కంకితముగా నెనిమిదాశ్వాసములు 1584 క్రీ. శ. వేంకటరామకృష్ణకవులు తెనిఁగించినది గలదు. మడికి సింగన తత్పూర్వుఁ డగుటచే నందు మనపద్యములు గానరాకుండుట యచ్చెరువు కాదు. కామందకము కౌటిల్యునియర్థశాస్త్రములోని సారము గలది. దానికి సంస్కృతభాషలో మూఁడువ్యాఖ్యలు గలిగియు నందుఁ గొన్నిస్థలములు క్లిష్టముగా నుండును. అది శాస్త్రగ్రంథమువలెఁ గాక మనోహరకావ్యమువలెఁ బ్రసన్నగంభీరమై యున్నది. సింగన యుదాహరించినకామందక మెవ్వరియనువాదమో కాని యడి ప్రౌఢమై సందిగ్ధస్థలములఁ జక్కఁగా వివరించునదియై యున్నది. తరువాతి కామందకము పెక్కుచోట్ల నీరసమై శాస్త్రవిరుద్ధ మగుటయుఁ గాక కవితయు శిథిలబంధయై వృత్తజాతిసమాహరణమున గవికిఁ బ్రజ్ఞాదారిద్ర్యము దోపించును. సకలనీతిసమ్మతములోని 286 వ పద్యమునకు రెండవకామందకమున—

మ.

తొలుతం దా జలకంబు దీర్చి చలువల్ తోడ్తో విరుల్ సొమ్ములుం
గలపం బందుచు దేవియుం జలకముల్ గావించి రాఁ జల్వలుం
గలవంబుల్ మణిభూషలున్ విరులు జోకం దానె యిప్పించి నే
ర్పులఁ గూడందగు రాజు పెంపెసఁగ నింపున్ సొంపు గల్పించుచున్.

ఈవర్ణనము రాజు లాత్మరక్షణార్థము తమదేవులయిండ్లకుఁ బోక వారినే తమవాసగృహములకుఁ దెప్పించుటయె నీతి యను నుపదేశసందర్భమున నున్నది. ప్రధానాంశము మఱచి కవి రాజభోగము వర్ణించె. 257 వ పద్యమునకు రెండవకామందకమున—