పుట:Sakalaneetisammatamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. అరయ శక్యాశక్యవి
చారము గావింపవలయు సన్మతి గాదే
వారణము కొండ డీకొని
యూరక నిజదంతభంగ మొందుట గాదే. 729

కామందకము



ఉ. అప్పటికిన్ వినన్ విషములైనను మీఁదను దామసంబుగాఁ
జెప్పెడివారుఁ జెప్ప విని చేయఁగనోపెడువారుఁ బెద్దయుం
జెప్పఁగ లేరు విలసిల్లుప్రియంబుల నంతకంత నె
ల్లప్పుడుఁ జెప్పువారలు ననంతమురాకలఁ జెప్పనేటికిన్. 730

పంచతంత్రి



క. సన్నపువాని విచారము
సన్నపుఁ బనులందుఁ గాక చతురం బగునే
ము న్నెన్నఁ డైన విందుమె
చెన్నుగఁ జల మూదిఁ రణము సేసినవారిన్. 731

ముద్రామాత్యము



ఆ. అర్థిఁ దీపు లైన యాహారములు గొను
టయును దెరువు నడచుటయును నిద్ర
నొందుటయును గార్య మూహించుటయుఁ జాల
నిక్క మొక్కరునకు నీతి గాదు. 732

పంచతంత్రి



ఆ. కమియఁ బండుమున్ను కాయఁ గోసినఁ జని
చేటె కాదు విత్తుచేటు గలుగు
పక్వమైనఁ గొనిన ఫల మిచ్చుఁ జెడదు బీ
జంబు కార్యసిద్ధిచంద మిట్లు. 733

ఉ. ఆతతనీతి మేలునకునై యొనరింపగ దైవ మొక్కకీ
డాతరువాతణ జేయుటకు నక్కొఱగామియు శాంతి సెందఁగా
నీతియె చేయఁగావలయు నెక్కుడు నేర్పరు లైనవారు వి
ఖ్యాతి గనంగ నొక్కయెడఁ గారిన నగ్గిన కాఁపమానదే. 734

విదురనీతి

వ. మఱియు రాజునకు సర్వకార్యంబులు మంత్రపూర్వకంబు గావున బుద్ధిసహాయులం గూడుకొనియుండవలయు, బుద్ధిసహాయులు ధనార్జకులు రణశూరులు