పుట:Sakalaneetisammatamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాదియగు కార్యపురుషులు కార్యకాలంబ కూర్తు మనుట గృహదాహం బగు వేళ నూతి కుపక్రమించుట, వారికి వలయు ధనంబు లిచ్చుట సుత్రేత్రంబున విత్తనం బిడియనట్లు, విభవం బెంత గల్గినను భోజనసహాయులు గల్గుదురు గాక కార్యసహాయులు గల్గనేర్తురే? మఱియు మూర్ఖుండు కార్యసహాయుం డగుట యంధుం డంధునకుఁ దెరువు చూపినయట్లు, వారివలన నొక కార్యంబు గల్గిన నది కాకతాళంబును ఘుణాక్షరన్యాయంబును నగుఁ గాని యథార్థంబు కాదు. రాజు చేపట్టిన మూర్ఖైనఁ గార్యవేది యగు ననందగదు; శివుండు గళంబున ధరియించిన కాలకూటం బమృతం బగునె? అది యంతియ కాదు. మూర్ఖునందుఁ గార్యం బిడుటయె తన్నుఁ జంపురక్కసుఁ దాన సృజియించుకొనుట. ఆ ఫలంబులు నల్పఫలంబులు – సమాయవ్యయంబులు దురంతంబులు హానికరంబులు నగు పనులు విచారయోగ్యంబులు గావున విఘ్నభయంబునఁ గార్యంబు విడుచుట తొడుకు గలుగు నని యారంభంబు విడుచుటయును అజీర్ణం బగునని యాహారం బుజ్జగించుటయును, దూరభీతత్వంబు నాసన్నశూరత్వంబు మహాపురుషగుణంబులు; దూరశూరత్వంబు నాసన్నభీతత్వంబుఁ గాపురుషగుణంబులు. మయూరంబపోలెఁ బ్రియోక్తులఁ బలుకుచు శత్రుసర్పంబుల నడంపవలయు. జలంబులం బోలె భూభృద్భేదనంబు సేయనోపియ మృదువు గావలయు; కాలువఁ దెచ్చు కాష్ఠంబులు దలమోచినచట్లు వైరలయెడ నోరుపు గలిగి జయింపవలయు. నదీప్రవాహంబు పడఁద్రోయవలయు తీరద్రుమతృణంబులకుఁ బాదప్రక్షాళనంబు సేయునట్లు చెఱుచునంతకు శత్రులయెడ సామంబులే పలుకవలయు; నల్పాధికకార్యంబులం దేక యత్నంబు సేయునది; తృణభూరుహంబులు గొనిపోవునప్పుడు నదీవేగం బొక్కటియకాదే. మేలైనను గీడైనను తలఁచినది సేయునంతకు హృతయంబు బయలుసేయవలవదు. పరుల విశ్వసించి మర్మంబు సెప్పుట తన్నుఁ గోలుపోవుట. చాపలంబున భయంబున నాలస్యంబున నవివేకంబున లోభంబున వేగిరపాటున నుత్సుకత్వంబునఁ గార్యంబు సెడుఁ దద్విపరీతం బైనను నగు. ఎవ్వరి కెట్లు ప్రియం బట్లు చేసి కార్యంబు గొనుట యుచితంబు. పంకిలం బగు మడువున నిడినఁగాక మొగలికర్పూపకర్దమంబునఁ బూచునే? నీచు లెక్కరానిచెట్టునుబోలె దండప్రయోగంబునంగాని ఫలం బిడరు; అతిక్రోధి యయిన యతని కైశ్వర్యం బగ్నియందుఁ బడిన లవణంబునుంబోలె నదరులఁ బడి విశీర్ణంబగు. నేరకున్ననైనఁ దనవారిం బరుల