[7]
షష్ఠాంకము.
95
పటాపంచలు గాకున్నదేమి ! హా ! దేవి ! యీనరరూపరాక్షసునివలన ఈమనుష్యాకారభూతము వలన ఇహసౌఖ్యము నీషణ్మాత్రమైన నెఱుంగకున్నను తాళి గట్టినమహాపరాధమునకు ధర్మపాశబద్ధవై, నే నవివేకినై, త్రాగుబోతునై, కులభ్రష్టుండనై , హంతకుడనై యొనరించిన సర్వాపరాధములను, సమస్త రాజద్రోహములను, నీపై నిడుకొని కంటికిఱెప్పవలె, కన్నతల్లివలె నన్నురక్షించుటయే కర్తవ్య మని భావించితివి. భార్యవగు నిన్ను రక్షింపవలసిన ధర్మమును తలక్రిందులుగా గావించి హంతకుఁడనై నిన్ను రాజభటుల కప్పగించి మొండినై ఇంక నెవ్వరి కొఱకు, ఏసౌఖ్యములకొఱకు ప్రాణముల నీకలుషాంగమున ధరించియుంటిని ! అన్నపూర్ణా ! ఈ పాపాత్ముఁ డొనరించిన యసంఖ్యాకదుష్కృత్యములకు శపించి సంహరింపక నీ వేల దాక్షిణ్యముం బూని రక్షించితివి ! దుష్టుఁడనైన నాకొఱకు కన్నతండ్రికి విరోధివైతివి. చిన్నిసుతుని వెంట నిడుకొని నీవంటి సాధ్వీమణులు కాలుమోపఁదగని రంగూన్పురమునకు వచ్చి నన్ను శోధించి కనుగొంటివి. క్రూరాత్ముఁడనై నిన్ను పరాభవించి వచించిన నాయందు సుంతైన క్రోధమూనక నీకన్నుల యెదుట నీకన్నతండ్రిని చంపుచున్నను ఆయపరాధమును సైతము నీపైనిడుకొంటివే ! హా! అన్నపూర్ణా ! అన్నపూర్ణా ! ఈజన్మమున పాపాత్ముఁడు చేయని క్రూరకర్మ మొక్కటియైన మిగిలియున్న దా! సర్వపాపములును యీదుష్టునిముఖమున పిశాచములై తాండవించుచున్నవి. ఛీ ! పాపము. ఈదురితాత్ముని ముఖముచూచిన మహాపాపము.
సీ. త్రాగిన పొగరుచే, తండ్రిచావునకయి,
డెందమ్మున ప్రమోదమందినాను