పుట:Ranganatha Ramayanamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుఱుతులు కొన్ని కన్గొనుచు నల్గడల - నెఱిఁ బరికించుచు నిఖిలాస్త్రశస్త్ర
జాలపాలితనూత్నశాలాంగణములఁ - జాలఁజెన్నగు పర్ణశాల కేతెంచి

భరతుఁడు మునివేషధారులైన రామలక్ష్మణులఁ జూచుట

మునివేషమునఁ జాల ముద మందు రాముఁ - గనుఁగొని యాత్మలోఁ గడఁగి శోకించి
"పొలుచు కాంచనగృహంబుల నుండువాఁడు - జగతిపైఁ బూరిసెజ్జను నున్నవాఁడు1560
పొగ డొందు పూలపాన్పున నుండువాఁడు - లలి దూలి పర్ణశాలల నున్నవాఁడు
నెఱసి కిరీటంబు నెఱిఁ దాల్చువాఁడు - తఱుచైన జడ లర్థిఁ దాల్చియున్నాఁడు
నోలి రాజులు గొల్వ నుండెడివాఁడు - లోలత మృగములలో నున్నవాఁడు
మేలిచన్దనమును మెయిఁ బూయువాఁడు - ధూళిధూసరితుఁ డై తూలియున్నాఁడు
మొనసి దివ్యాంబరంబులు పూనువాఁడు - మునివృత్తి వల్కలంబులు గట్టినాఁడు
రసరసాన్నములను మెసవెడువాఁడు - కసరుఁగాయలఁ బ్రొద్దు కడపుచున్నాఁడు
చూచితే శత్రుఘ్న! శుభమూర్తి రాముఁ - డీచందమునఁ దుఃఖ మీఁదుచున్నాఁడు
కైకేయి పాపంపుఁగడుపునఁ బుట్టి - యీకష్టదుర్దశ నేఁ జూడఁగలిగె"
ననుచుఁ దముఁడుఁ దాను నారామవిభునిఁ - గని మ్రొక్కుటయు వారిఁ గౌఁగిటఁ జేర్చి
కన్నుల హర్షాశ్రుకణములు నొరుగ - వెన్నులు నివిరి భావించి దీవించె.1570
అహిమాంశుకులునకు నాసుమంతుండు - గుహుఁడు మ్రొక్కిరి భక్తి కొనసాగ నపుడు
ధరణిజకును సుమిత్రాతనూజునకు - భరతశత్రుఘ్నులు ప్రణమిల్లి కొలువఁ
గుశపీఠముల నిల్వఁ గోరి రాఘవుఁడు - దశరథుసేమంబు తల్లులశుభము
పలుమాఱు నడుగుచు “భరత! నీ వేల- యిల యేల కింతద వ్వేగుదెంచితివి?
భూతలాధీశుపంపున రాజ వగుచు - నీతితోఁ జేయుదే నీవు రాజ్యంబు
దశరథేశునకు సత్యప్రకాశునకు- విశదపుణ్యునకుఁ గావింతువే పూజ?
తల్లుల నెల్ల నాదర ముల్లసిల్ల - నుల్లంబు చల్లఁగా నూఱడింపుదువె?
కోవిదు మత్కులగురుఁ దపోనిష్ఠు - నావసిష్ఠు గరిష్ఠు నర్చించి నీవు
అగ్నిహోత్రముల సంధ్యాకాలనియతి - భగ్నంబు గాకుండఁ బాలింతె నీవు
సుజనులౌ మంత్రుల చొప్పెల్ల దెలిసి - విజయంబు నామంతవిధి యెఱుంగుదువె?1580
యపరరాత్రుల లేచి యర్థచింతనము - నిపుణతఁ జేయుదె నీవు నిత్యంబు?
నరసి యుత్తమమధ్యమాధమజనుల - వెరవుతోఁ బని గొందువే తగినట్లు?
తనవారియెడ నైన దగవున దండ - మనురక్తిఁ జేయుదె యపరాధ మెఱిఁగి?
మతిమంతు సకలసమ్మతు స్వామిహితుని - వితతవిక్రము సైన్యవిభుఁ జేసినావె?
కొలిచినవారికిఁ గోరి జీతములు - నిలువఁ గాకుండ నిచ్చలు నొసంగుదువె?
చారులవలన రాష్ట్రములవర్తనము - వైరులతెఱఁగు సర్వము నెఱుంగుదువె?
జాలిఁ దూలెడి పేదసాదల మొరలు - వాలాయముగ విందువా గర్వ ముడిగి?