పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీ వారు గ్రామములో పెద్దసిద్ధాంతులుగదా? తెలిసికూడ చిన్నదానిని యర్ధాయుష్మంతున ____

పె__(మాట కడ్డము వచ్చి) ఔనౌను; నీ వడుగఁ బోవునది నేను గ్రహించినాను. ఎవరి యదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండమోయవలసిన వ్రాఁతయుండఁగా నెవరు తప్పింపఁగలరు? ఎవ రైనా జాతకము మంచిదిగాఁ జూచి వివాహము జేయుదురుగాని పెండ్లికుమారునకు లేని యాయువును తెచ్చి పోయఁగలరా?

రు__అవును. జాతకములో మీ యల్లునకు పూర్ణాయుస్సే యున్నది కాఁబోలు?

పె__(కొంచె మనుమానించి) పూర్ణాయుస్సా-అవును పూర్ణాయుస్సే యున్నది. జాతక ప్రకారము జరగదా ఆందునేమో, వేళ తిన్నగా కట్టి జాతకము వ్రాసిన యెడల, ఆందులో నెన్ని యక్ష రము లున్నవో ఆన్నియక్షరములను జరుగును. శాస్త్రము చక్కగా తెలియనివారు తిన్నగా వేళ కట్టలేక పాడుచేయుదురు. మావారు ఇన్ని ముహూర్తములు పెట్టినారు కదా? నీ వెఱిగినంత వఱకు మఱియొక విధముగా నెక్కడనై న జరిగినదేమో చెప్పు,

రు__కన్నమ్మగారి బుచ్చమ్మ వివాహ ముహూర్తము మా చావడిలో మన సిద్ధాంతిగారే పెట్టినారుగాని దాని మగని జాతకము కూడ సిద్ధాంతిగారే వ్రాసి__

పె-అవును, ఒకానొకటి తప్పిపోవుటయు గలదు. జ్యౌతిషమునకుఁ బార్వతిశాప మున్నదఁట మావా రెప్పడును ఈసంగతినే చెప్పచుందురు. గట్టుమీఁద మట్టెల చప్పుడగుచున్నది. ఎవ్వరో వచ్చుచున్నట్లున్నారు. ఈపాటి మన మీసంగతి చాలింతము.అని వెనుక తిరిగి చూచి బిందె యొడ్డుననుంచి స్నానమునకు నీళ్ళలో దిగుచున్నది.

ఇంతలోఁ గొందఱు పుణ్యస్త్రీలను విధవలును మెట్టు దిగుచు ముందున్నవారు వంగి కాళ్ళ వెండిపావడములను కొంచెము పయికి దీసికొనుచు వెనుక దిరిగి దూరముననున్నవారు వచ్చువఱకు దగ్గఱ

30