పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారితో మాటలాడుచు మెల్లమెల్లగా వీటి సమీపమునకు వచ్చి గృహ కృత్యములను గుఱించి మాటాడుకొనుచు బిందెల నొడ్డునఁ బెట్టిరి. అందఱును నొక్కచోట సమావేశమయి సావకాశముగా మాటాడు కొనుటకు నీళ్ళకు వచ్చినప్పటికన్న మంచి సమయము స్త్రీల కెప్పుడును దొరకదు గదా అందుచేతనే వారు సాధారణముగా కొంచెం తీఱుబడిచేసుకుని మాటాడవలసిన నాలుగు మాటలను నీళ్ళకు వచ్చి నప్పడే మాటాడుకొనిపోవుదురు. అప్పుడు ముప్పదియేండ్ల యూడు గల పొట్టి దొకతె ముందుకువచ్చి ముక్కుమీఁద వ్రేలు వైచికొని "ఓసీ వెంకమ్మా! రాత్రి శేషమ్మను మగఁడు కొట్టినాఁడట! విన్నావా?"

వెంకమ్మ__దానిని మగఁ డెప్పుడును అలాగుననే కొట్టుచుండును. నెలదినముల క్రింద కఱ్ఱపుచ్చుకొని కొట్టినప్పుడు చేతి గాజులన్నియు పగిలిపోయినవి.

పొట్టి__దానిని మగఁడు తిన్నగా ఒల్లడcట- అని బుగ్గను చేయిపెట్టుకొని "ఓసీ ఓసీ! అతఁడు ముండ నుంచుకొన్నాఁడఁట సుమీ."

బట్టతల ముతైదువ యొకతె చేతులు త్రిప్పకొనుచు ముందుకు వచ్చి "సరి సరి! దాని గుణము మాత్రము తిన్ననిదా? మొన్న సుబ్బావుధానుల కొడుకుతో మాటాడుచుండగా మగనికంటనే పడ్డ దఁట మగవాఁ డేలాగున నున్నను దోషములేదు. ఆఁడుదాని గుణము తిన్నగా నుండనక్క ఱలేదా?"

పొట్టి__దానికేమిగాని, పాపము: చిన్నమ్మను అత్తగారు లోకములో లేని కోడంట్రికము పెట్టుచున్నది. అంతేకాకుండ మగ డింటికి వచ్చునప్పటి కేవో నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును దానిమీఁద అతఁడు ప్రతిదినమును దానిని చావగొట్టు చుండును.

పదియాఱు సంవత్సరముల వయస్సుగల యొక చామన చాయది కన్నుల నీరు పెట్టుకొనుచు-"అత్తగారు బ్రతికియున్న

31