పుట:Raadhika Santhvanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 రాధికాసాంత్వనము

[1]తొగరు వాతెఱ మేలిమి తొఱఁగు నమ్మ
చిన్ని చిన్నారు ముంగురు ల్చెదరు నమ్మ
యెల్లి యెల్లుంట నా యల్లు డించు వచ్చుఁ
[2]గుంద వలవదు నా యాన మందయాన. 82

వ. అనిన విని. 83

క. తను వెల్ల ఝల్లు మనఁగా
నునుమోవి చలింప లేచి నుదురు చెమర్పన్
ఘనకేశబంధ మూఁడగఁ
గనుఁదమ్ములు మోడ్చి వ్రాలెఁ గామిని మూర్ఛన్. 84

వ. అంతట నయ్యిందువదన లందఱుం గూడుకొని. 85

క. ఏ మంద మేమి సేయుదు
మే మందున దీరుఁ దేరు నెటు లోర్తు మయో
యే మందయాన నడుగుద
మీ మందరకుచ తెఱఁగు లిట్టివి యనుచున్. 86

క. అని పలుకుచు వెస నులుకుచు
గని తలఁకుచుఁ గనుల నశ్రుకణములు చిలుకన్
ఘనశోకమగ్న లగుచును
గనకాంగిని చుట్టు ముట్టి కాంతలు వేగన్. 87

ఉ. కోమలి సిబ్బెపు న్మెఱుఁగుగుబ్బల జొబ్బిల నొప్పు కప్పురం
బా మరునగ్గి సోకి యది యంతట భగ్గున మండ మన్మథ

  1. మెఱుఁగు వాతెఱ మేలిమి కుందునమ్మ-తా. ప. ప్ర.
  2. అడల వలవదు నా యాన మందయాన-తా. ప. ప్ర.