పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాధించుకున్న తెలంగాణ మీద దాడి చేసి, పైశాచిక ఆనందాన్ని అనుభవించిండ్రు. “ప్రాంతాలుగ విడిపోయి, అన్నదమ్ములుగ కలిసుందాం” అనే తెలంగాణ నినాదాన్ని సీమాంద్ర నాయకత్వం పటాపంచలు చేసింది. అయినా తెలంగాణ ప్రజలు ఓర్చుకున్నరు. కేంద్రప్రభుత్వం చేసిన నిర్ణయానికి కట్టుబడి శాంతియుత ప్రజాస్వామ్య పద్దతుల్లో తెలంగాణని సాధించుకున్నరు.

జూన్‌ 2, 2014న దేశచరిత్రలో తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగ ఆవిర్భవించడంతో నింగినంటిన సంబరాలు చేసుకున్నరు. ఈ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని 'ప్రధానఘట్టాలను ఒక చోట చేర్చి వుస్తకంగ తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం చేసిన. ఈ సందర్భంగ నాకు సహకరించిన మిత్రులు, సాహితీ పెద్దలందరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ పుస్తకానికి ఆర్థికంగా సహకరించిన పెద్దలు అమరబోయిన శ్రీనివాస్‌- డిఇ సూర్యపేట, పోలోజు యాదగిరి-డిఇ బోనగిరి, గుండమల్ల రాములు, కాళీ నాగాచారి అదే విధంగా నల్లగొండ జిల్లా టిఆర్‌వి౭ఎస్‌ నాయకులు పి కరెంట్‌రావు, కోట్ల విష్ణువర్ధన్‌రెడ్డి, పొట్టబత్తుల శ్రీనివాస్‌, తవిడబోయిన గిరిబాబు గార్లకు (ప్రత్యేక ధన్యవాదాలు.

- అంబటి వెంకన్న

నల్లగొండ

8 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం