పుట:Prathyeka Telangana Udhyamam -2015.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కులీకుతుబ్‌షా 1512లో స్వతంత్ర కుతుబ్‌షాహి రాజ్యాన్ని స్థాపించిండు. కులీకుతుబ్‌షా ఆఫాకీ అయినప్పటికి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానికులకు ఎక్కువ అవకాశాలు కల్పించి, తెలుగు భాషను ప్రోత్సహించిండు. కుతుబ్‌షాహీలు గోల్కొండ సామ్రాజ్యాన్ని దగ్గరదగ్గర రెండు వందల సంవత్సరాలు పరిపాలించిండ్రు. అన్ని రంగాలలో అభివృద్ది పథంలో దూసుకుపోతున్న కుతుబ్‌షాహీల పాలన జెరంగజేబు దండయాత్రలతో అంతం అయ్యింది. దక్కన్‌ ప్రాంతంలో అసఫ్‌జాహీలు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నరు. బెరంగబాద్‌ రాజధానిగా పరిపాలన సాగించిండ్రు.

అసఫ్‌జాహి వంశ స్థాపకుడు నిజాం ఉల్‌ ముల్క్‌ అసలు పేరు మీర్‌ ఖ(ముద్దిన్‌ ఖాన్‌. మొగల్‌ చక్రవర్తి షా ఆలం కముద్దిన్‌ని అయోధ్య సుబేదారుగ నియమించిండు. ఆ తర్వాత చక్రవర్తి ఫరూక్‌షయర్‌ ఈయన రాజనీతిని, పరిపాలనా దక్షతను చూసి నిజాం ఉల్‌ ముల్మ్‌ఫతేజంగ్‌, అనే బిరుదునిచ్చి దక్కన్‌ సుభేదారుగా నియమించిండు. నాటి దక్కన్‌ సుభా కాందేశ్‌, బీరార్‌, తెలంగాణ, దౌలతాబాద్‌, అహ్మద్‌నగర్‌, ఆర్మాట్‌లతో కూడిన సువిశాల ప్రాంతం.

నిజాం ఉల్‌-ముల్మ్‌ (1724-48): నిజాం ఉల్‌ ముల్మ్‌తన స్వతంత్ర పాలనలో భాగంగ మొదట తెలంగాణ మీద ఆదిపత్యాన్ని సాధించిండు. 1724 నుంచి 1748లో చనిపోయేంత వరకు దాదాపు 24 సంవత్సరాలు పరిపాలించిండు. ఉల్‌ ముల్క్‌ మరణానంతరం ఇతని రెండవ కొడుకు నాజర్‌జంగ్‌ దక్కన్‌ సుబేదార్‌ అయ్యిండు.

నాజర్‌ జంగ్‌ (1748-1751): 1748 నుంచి 1751వరకు నాజర్‌ జంగ్‌ (మీర్‌ అహ్మద్‌ అలీఖాన్‌) పరిపాలించిండు. ఈయన కాలంలో ఆంగ్లేయులు, ఫ్రెంచి వాళ్ళు పాలనలో జోక్యం చేసుకొని ఏకంగా నిజాం మేనల్లుడైన ముజఫర్‌జంగ్‌ను దక్కన్‌ సుబేదార్‌గా ప్రకటించిండ్రు. ముజఫర్‌జంగ్‌ కూడ హత్య చేయబడిండు. దీంతో నిజాం మూడవ కొడుకైన సలాబత్‌ జంగ్‌ (ఫెంచి వాళ్ళ సహకారంతో దక్కన్‌ సుబేదార్‌ అయ్యిండు.

సలాబత్‌ జంగ్‌ (1751-1768): 1751 నుంచి 1763వరకు సలాబత్‌జంగ్‌ పాలించిండు. తనకు సహకరించిన ఫెంచివారికి కొండవీడు, నిజాంపట్నం, నర్భాపురం ప్రాంతాలను ఇచ్చేసిండు.

నిజాం అలీ ఖాన్‌ (1768-1803): 1763 నుంచి 1808 వరకు గల నిజాం అలీఖాన్‌ పాలనకాలంలో నిజాం రాజ్యం మీద ఫ్రెంచి వారి పెత్తనం నషించి బ్రిటీష్‌ ఆధిపత్యం మొదలైంది. నిజాం అలీఖాన్‌కు రెండవ అసఫ్‌జా అనే బిరుదును కూడ

10 * ప్రత్యేక తెలంగాణ ఉద్యమం