పుట:PandugaluParamardhalu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్నానం చేసినట్లు ఐంది. పైగా ఆతురతలో వున్నారేమో ఆరోజుల్లా వారు నిరాహారులై వుండి పోయారు.

  ఇంతలో ఆకన్య ఆతొర్రలోనుంచి వెళ్ళిపోవడానికి సిఅసి పడింది. అప్పుడు ఆ ఆరుగురు ఆమెను ప్రార్ధించారు. రాక్షసుని చంపి తమ్ము రక్షించమని. ఈ సరికి రాక్షసుడు అక్కడికి వచ్చివున్నాడు. అతనికి ఆకన్య కనిపించింది. నీవు ఎవరవనీ. ఆఅడవిలోకి ఎందుకు వవ్వావనీ అతడుప్రశ్నించాడు.
    దానికి ఆమె తనపేరుతో అత అతనికి నిమిత్తంలేదనీ-అతన్ని సంహరించడానికి శంకరుడు తన్ను ఆదేశించాడనీ- తచేతుల్లోచావడానికి ఆరాక్షసుడు అక్కడికి వచ్చాడనీ బదులు చెప్పింది. చెబుతూనే ఆమె కత్తితో అతని మీదికి వెళ్ళి అత ఈ చేతులు, తల ఖండించి ఆకాశం వరకు విజృభించింది. దుర్గాదేవి చెలికత్తెలైన యోగినిలు ఆమెను ఆశీర్వదించారు. ఆతురుల్ని రక్షించిందని స్త్రోత్రం చేశారు.
  అప్పుడు తొర్రలో నుంచి ఆర్గురు బయటికి వచ్చి ఆమెపాదాల మీద పడి తమ్ము రక్షించినందుకు మొక్కారు. అందుమీద ఆమె వారితో తపేరు ఏకాదశి అనీ, తనకు తల్లిదండ్రులులేరనీ, వారి విశ్వాసం వల్లనే తానుజన్మించాననీ, ఆనాడు చేసినట్లే పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి వ్రతం చేయమనీ, సకల పాప పరిహారం అవుతుందనీ చెప్పింది “కొదారి“.
    ఏకాదశి వ్రతప్రాశస్త్యాన్ని గురించి పురాణాలు విశీషంగా చెబుతున్నాయి. ఆసందర్బంలో తరుచు చెప్పబడేది రుక్మాంగదుని గాధ. రుక్మాంగదుడు మంచిరాజు. అతనికి నందవనం అనే గొప్పపూలతోట ఉంది. అపురూపమైనవి, మంచి వాసనగలవి, అయిన పూలచెట్లను ఎన్నిటినో అతడు ఆతోటలో నాటించి పెంచే ఏర్పాటు చేశాడు. అందలి పూలతో అతడు నిత్యం దేవపూజ చేసేవాడు. రుక్మాంగదుని పూలతోట ఇట్లా ఉంటూ ఉండగా స్వర్గ లోకంలో ఇంద్రుని ఉద్యానవనంలో ఒకనాడు ఎందుచేతనో పువ్వులు లేకపోయాయి. అందుచేత ఇంద్రుని దేవపూజ ఆగిపోయింది. పువ్వులకోసం అన్వేషణ ప్రారంభమైంది. భూలోకంలో రుక్మాంగదుని పూలతోటలో పువ్వులు పుష్కలొంగా ఉన్నాయి అనే సంగతి వాకబు వల్ల అతనికి తెలిసింది. మానవ మాత్రుని పువ్వుల కోసం