పుట:PandugaluParamardhalu.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్యేష్టశుద్ధ తదియనాడు చేయాలి. ఆనాడు ఉదయాన్నే స్నానంచేసి అరటి చెట్టు మొదట అలికి పంచవన్నెముగ్గులు పెట్టాలి. రంబకు అధిష్ఠాన దేవత సావిత్రి కావున అరటి చెట్టు క్రింద సావిత్రీ దేవిని పూజించాలి."

   అందుమీద పార్వతి మహాశయా! అరటిచెట్టుకు సవిత్రీదేవి అధిష్ఠానదేవత ఎట్లైనది! అని ఆదిగింది.  దానికి సమాధానముగా భృగువు ఇట్లా అన్నాడు.  బిడ్డా! అడగదగిన ప్రశ్న వేశావు.  సావిత్రి, గాయత్రి అని బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలు.  సావిత్రీదేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మవద్దకు వెళ్ళడంమాని వేసింది.  గాయిత్రి ఆమెకు చాలా దూరము చెప్పి చూచింది.  సావిత్రి తన మంకుపట్టు వదలలేదు.  బ్రహ్మకు కోపం వచ్చింది.  ఈ లోకాన్ని వదలిపో మానవ లోకంలో బీజంలేని చేట్టువైపుట్టు అని అతడు సావిత్రిని శపించాడు.
  అప్పుడు సావిత్రికి పశ్చాతాపం కలిగింది.  బ్రహ్కకాళ్ల మీదపడి మన్నించమని ప్రాధేయపడ్డది.  కాని బ్రహ్మకు దయరాలేదు.  గత్యంతరం లేక సావిత్రి భూలోకానికి వచ్చి అరటి చెట్టయిపుట్టింది.  అరటి చెట్టయి ఆమె అయిదేళ్లు బ్రహ్మను గురించి తపస్సుచేసింది.  అప్పటికి  బ్రహ్మకు మనస్సు కరిగింది.  జ్యేష్ఠశుద్ధ తదియనాదు అతడ్ సావిత్రికి ప్రయక్షమయ్యాడు.  "నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు అరటిచేట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు ఈదేరుతాయి.  ఇక నీవు నాతో సత్య లోకానికి వచ్చివేయి" అంటొ  బ్రహ్మ ఆమెను కొని పోయాడు.  సావిత్రికి శాపమోక్షమయిన దినము కాబట్టి జ్యేష్ఠశుద్ధ తదియ ఒక పర్వదినమయింది.
   అప్పుడు పార్వతి 'స్వామీ! అయితే ఈ వ్రతం సాంగం చేసే నియమాలు దయచేసి తెలియ చేయండి ' అని కోరింది.
    అందుమీద భృగుమర్షి బిడ్డా! ముగ్గులు పెట్టిన అరటిచెట్టు కింద మంటపం వేయవలెను.  దజనిని సరస పదర్ధసంపన్నంచేయాలి.  అరటిచెట్లనీడను పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్తోత్రము చేయవలెను.   రాత్రి జారగణంఊ ఛెయాలి. మరునాటి నుంచి రాత్రి జాగరణ అవసరంలేదు.   పద్మాసనస్థ అయి పగలు సావిత్రి స్తోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్లక్రిందనే విశ్రమిస్తూఉండాలి.  ఇట్లా నెలరోజులు చేసి ఆ మీద సరస పదార్గస్ంపన్నమైన ఆ మంటపమును పూజ్యదంపతులకు