పుట:PandugaluParamardhalu.djvu/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఈవరకు లోపాముద్ర చేసి భర్తను పొందింది“ అని చెప్పాడు.

  పార్వతి ఆవిధముగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది.ఆదీక్షకు మెచ్చి శువుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్ళాడాడు. ఇది రంభా వ్రతగాధ.
  ఇచట పద్మాసనం వేసుకుని కూర్చుని తపస్సు చేయాలన్న చోట కృత్యసారసముచ్చయం అను గ్రంధంలో పంచాగ్ని సాధన చేయాలను ఉన్నది.  పంచాగ్ని సాధనమనగా నాలుగు ప్రక్కల నిప్పులగుండాలు ఉంచుకుని తాను సూర్యునివైపు ఱెప్పవేయకుండాచూస్తూ ఉండడం. ఇదికఠోరదీక్ష.
  రంభావ్రతం ఉత్పత్తి చూడగా ఇది ప్రత్యేకం స్త్రీల కొఱకు ఉద్దిష్టమనదని తేలిపోతూనే ఉంది. అరటిచెట్లు నీడను జ్యేష్ఠశుద్ద తదియ మొదలు, ఆషాఢశుద్ద తదియవరకు నెలరోజులు నివశించడం ఆరోగ్యాన్ని కూరుస్తుంది. వేసవిలో పగటిపూట చెట్ల నీడ దాహతాపాన్ని తగ్గిస్తుంది. చల్లగా ఉంటుంది.
  మనదేశంమీచికి ఎత్తివచ్చిన అలెగ్జాండరు ఇచ్చటి మునులు కొందరు ఈచెట్ల ఫలాలు తిని జీవిస్తూ ఈచెట్లనే నివాసంగా ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడనీ, అందుచేతనే అరటికి గ్రీకుభాషలో సాపియంటం (జ్ఞానము కలది) అనే పేరు వచ్చిందనీ చెబుతారు. దీనిని పట్టి అరటిచెట్టు నీడ జ్ఞానదాయిని అని గ్రీకులు కూడా భావించినట్లు వెల్లడి అవుతూ ఉంది.
   ఈ రంభావ్రతం కాక అరటిచెట్టు సంబంధమైనది కదళీవ్రతం అని మఱి ఒక వ్రతంకూడా భారతీయులు చేస్తారు. అది భాద్రపద శుక్ల చతుర్దశినికాని, వీలులేకపోతే కార్తీక శుద్ద చతుర్దశిని కస్ని ఛెస్తారు. ఆవ్రతం చేస్తే స్త్రీలు సౌభాగ్య వతులై చిరకాలం జీవిస్తారని ఫలశ్రుతి.
          జ్యేష్టశుద్ద చవితి
   దీనిని స్మృతి కౌస్తుభం ఉమాచతుర్దిగా పేర్కొంటూ ఈనాడు ఉమాపూజనము చేయాలని చెబుతూ ఉంది.

    గణేశ చతుర్ది అని ఆమాదేర్ జ్యోతిషీ
    ఈనాడు శుక్లాదేవి పూజ చేయాలని స్మృతి కౌస్తుభము
               జ్యేష్టశుద్ద పంచమి

     దీనిని స్మృతికౌస్తుభం ఉమాచతుర్దిగా పేర్కొంటూ ఈనాడు ఉమాపూజనము చేయాలని చెబుతూ ఉంది.

     గణేశ చతుర్ది అని అమాదేర్ జ్యోతిషీ,
     ఈనాడు శుక్లాదేవి పూజచేయాల్ని స్మృతి కౌస్తుభము
            జ్యేష్టశుద్ద పంచమి
  పితృదేవతలను పూజించాలని కొన్ని వ్రత గ్రంధాలు