పుట:PadabhamdhaParijathamu.djvu/767

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీమూ - చీర 741 చీర - చీర

ముఖ్యంగా వినగూడనివి వినుటవల్ల.

  • "పుడమి జనంబు లెల్ల నినుఁ బ్రువ్వఁగఁ దిట్టఁగ వించు నున్కి నొ,చ్చెడు మది యెప్పుడున్ చెవులు చీములు గట్టెడు." భార. ద్రో. 2. 10.

చీమూ నెత్తురు ఉన్న శరీరం

  • కామక్రోధాదు లుండుట మానవమాత్రులకు తప్పదను పట్ల అనే మాట.
  • "పాపం సమర్త కాక ముందు ముండమోసిన పిల్ల. అది మాత్రం ఏం చేస్తుంది? చీమూ నెత్తురూ ఉన్న శరీరం..." వా.

చీరఛాప

  • తెరచాప. బ్రౌన్.

చీరచింపు

  • ఒక రకం చేప.

చీర చిక్కు

  • గర్భము ధరించు.
  • నెలలు అయినకొలదీ కడుపు పెరగడం, తన్మూలంగా చీర తక్కువపడడం మీద ఏర్పడిన పలుకుబడి.
  • "చిట్టుముల్, రామకు సంభవించె నభిరామతరంబుగఁ జీర చిక్కినన్." హంస. 2. 93.
  • "పాయనిమంద నుండి యడపా దడపా చనుదెంచు బోయనిం, బోయినఁ జీర చిక్క దఁట పుణ్యము లేదని మానసంబునన్." పంచ. (వేం.) 1. 56. పు.
  • "నెల రెణ్ణెల్లకుఁ జీర చిక్కెఁ ద్రిజగ న్ని ర్మాత యిల్లాలికిన్." కా. మా. 2. 80.

చీరపిట్ట '*చీర పేను. బ్రౌన్. చీర పెట్టు

  • ఒక చీరను కానుకగా ఇచ్చు.
  • "తన భార్య తద్దినానికి ఏటా ఎవరో ఒక ముత్తైదువకు చీర పెట్టడం అతనికి అలవాటు." వా.

చీరపేను

  • తెల్లనిపేను.
  • ఈ పేలు పడ్డం దరిద్ర మని అంటారు. భార. ఆను. 5. 54.
  • "ఆ చీరపేలు పడిన వెధవను లోపలి కెందుకు రానిచ్చార్రా." వా.
  • చూ. చీరపోతు.

చీరపోతు

  • చీరపేను.
  • వాడుకలో - చీరపోతు అనే రూపం ఎక్కువగా వినవస్తుంది. బ్రౌన్.
  • చూ. చీరపేను.

చీర వేయు

  • మగడు చనిపోయినప్పుడు పుట్టింటివారు రేవులో విధవకు కొత్తచీరను ఇచ్చు.
  • "అంతమంది అన్నదమ్ము లుండీ ఆ విడకు చీర వేసే దిక్కయినా లేక పోయారు." వా.