పుట:PadabhamdhaParijathamu.djvu/766

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీమ - చీమ 740 చీము - చీము

పరియ చీమపరి యనన్ గవిసె నందు." మను. 4. 110. చీమల గామల వలె

  • ఇంటినిండుగా.
  • చీమలు గామలు. జం.
  • "మా యింటి ముందటను, గలగొని చీమల గామలవలెను, జెలఁగుచు ముందర శిశువు లాడఁగను." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1890-91.

చీమలచాలు వలె

  • అల్పముగా.
  • "అ,తని మదికిన్ భవద్బలవితానము చీమలచాలుఁ బోలె నై, కనఁబడు." శుక. 3. 387.

చీమలు దూరని

  • దట్ట మైన.
  • అతి చిన్న దైన.
  • చీమ పట్టుట కైనా వీలు లేనంత దట్ట మైన దనుట.
  • చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి - జానపదగాథలలో సామాన్యంగా వచ్చే పలుకుబడి.
  • "చీమలు దూఱని చీఁకటి కాన, సరగునఁ గొనిపోయి సారంగధరుని." సారం. ద్వి. 2. 88.

చీమవలె కూడబెట్టు

  • మిక్కిలి జాగ్రత్తగా దమ్మిడీ దమ్మిడీ కూడబెట్టు. ప్రతి చిన్నదానినీ సంపాదించి చీమ కూడబెట్టు ననుటపై వచ్చినది.
  • "బిడ్డల కొసఁగక పెండ్లాము కిడక వడ్డి కిచ్చుచుఁ జీమవలెఁ గూడఁ బెట్టి." గౌర. హరి. 2. 166.

చీము నెత్తురు ఉంటే

  • పౌరుషం ఉంటే - స్వామానం ఉంటే.
  • "వా డన్నిమాట లంటూ ఉంటే చీమూ నెత్తురూ ఉన్నవా డయితే బయిటికి రాకుండా యింట్లో దూరుకొంటాడా?" వా.

చీము నెత్తురు ధారపోయు

  • త్యాగము చేయు, ఎన్ని శ్రమల కైనా ఓర్చు.
  • "ఆ సంస్థకోసం వాడు తన చీము నెత్తురూ ధారపోశా డంటే నమ్ము." వా.

చీము నెత్తురు లేని...

  • ఏమాత్రం స్వాభిమానం, ఆత్మగౌరవం లేని.
  • "వా ణ్ణెన్ననీ ఏం లాభం? చీము నెత్తురు లేని వాడు. ఏ మన్నా పడతాడు." వా.

చీము పట్టు

  • కురుపులు మొదలైనవానిలో చీము చేరు.
  • "కొబ్బెరా పప్పూ తినకురా. చీము పడుతుంది." వా.

చీము పోయు

  • చీము పట్టు.
  • "చీము పోసి కురుపు నొప్పి చేసింది." వా.

చీములు గట్టు

  • బాధ చెందు.