పుట:PadabhamdhaParijathamu.djvu/765

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీమం - చీమ 739 చీమ - చీమ

చీమంత

  • కొంచెము, కాసంత. చీమ అన్నిటికన్న చిన్నది కదా - అంత అనుట.
  • "చీమంత యైన వంచింపని బాస." బస. 2. 28. పు.
  • చూ. కాసంత, చింతాకంత.

చీమంతకు (కైకొనడు)

  • కొంచెం కూడా (లెక్క పెట్టడు.)
  • "చీమంతకుఁ గైకొనఁ డసుర, భటాంతకవిశ్రాంతి." కుమా. 11, 89.

చీమ కండ్లు

  • చిన్న కండ్లు

చీమ కుట్టినట్టు లైన లేదు

  • ఏకొంచెం బాధ కూడ లేదు.
  • ఏ కొంచెం లెక్క లే దనుట.
  • "దీని గూర్చి మనము నిర్లక్ష్యముగఁ జూచుచున్నారము. మన కేమో చీమ కుట్టినట్టు లైన లేకుండ నున్నది." సాక్షి. 60. పు.
  • వాడుకలో రూపం - చీమ కుట్టిన ట్టైనా లేదు.
  • "వాడికి ఇంతమంది యిన్ని మాటలంటుంటే చీమ కుట్టిన ట్టయినా లేదు." వా.

చీమగంగాయాత్ర

  • అసంభవము. తెగనిది, నెఱవేఱనిది.

చీమచింత

  • ఒక రకమైన చెట్టు.

చీమ చిటు కనకుండ

  • ఏమాత్రం శబ్దము కాకుండ.
  • "చీమ చిటు కనకుండంగఁ జిత్రపటము, వెంటఁ గళ దేల్పుకైవడి......" సుదక్షి. 4. 117.

చీమ చిటు కన్నను

  • ఏమాత్రం అలికిడి అయినా.
  • "ఆలు బిడ్డ లే, కరయని రేలుఁ జీమ చిటు కన్నను విప్పనిమూఁకలున్." ఉ. హరి. 1. 131.
  • వాడుకలో కూడా ఉంది.
  • "చీమ చిటుక్కు మన్నప్పుడల్లా వాడు వస్తున్నా డేమో నని చూచాను." వా.

చీమ చిటుక్కు మాన్న, చిమ్మట జిఱ్ఱన్న

  • ఏమాత్రం అలికిడి అయినా.
  • "చీమ చిటుక్కు మన్న వినుఁ జిమ్మట జిఱ్ఱన నేఁగునంతలో." హంస. 3. 40.

చీమ చిటుక్కు మన్న చిమ్మట బుఱ్ఱన్న

  • ఏమాత్రం అలికిడి అయినా.
  • "చీమ చిటుకు మన్న చిమ్మెట బుఱ్ఱన్న, నెదుర మూషికములు మొదలుకొనిన." పంచ. వేం. 4. 168. పు.

చీమచిప్పర

  • ఒక రకమైన గడ్డి.

చీమపరి లాగా

  • చీమలబారువలె (చుట్టు ముట్టు.)
  • "రయ సముద్ధూతధూళి ధూసరిత ధారాధర పథం బగుచు నొక్క