ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కాలు____కాలు 459 కాలు____కాలు
కాలుచ్చు
- పక్షులు మొదలగువాని కాళ్లకు చుట్టుకొనే వల, ఉరి.
- "మిడిబోనుల గాలుచ్చుల, బడదోలియు బోగులోను పఱచియు లేళ్లన్, వడి గల జింకల నెల్లన్, బొడిచిరి..." యయా. 2. 19.
కాలు జారు
- తప్పుదారి త్రొక్కు.
- వ్యభిచరించు.
- "ఆ పిల్ల ఎప్పుడో చిన్నతనంలో కాలు జారిం దని అంత నీచంగా చూడడం ఏం బాగ లేదు." వా.
- "ఒకసారి కాలు జారితే ఇక ఆపుకోవటం కష్టం." వా.
కాలు తీసి పెట్టకుండా
- చూ. కాలు క్రింద పెట్టకుండా.
కాలు త్రొక్కి కంకణం కట్టు
- విధివిహితంగా పెండ్లి చేసుకొను. వివాహంలోని ఆచారంపై వచ్చిన పలుకుబడి.
- "అంత నిర్బంధం చేయడానికి నీ వేం కాలు తొక్కి కంకణం కట్టావా? నా యిష్టం వచ్చినచోటికి నేను పోతాను." వా.
- చూ. కాలు ద్రొక్కు.
కాలు త్రొక్కికొని వచ్చు
- వెన్నంటి వచ్చు.
- "మీకును మాకును నీ వైరం బెక్కడ నుండి కాలు త్రొక్కికొని వచ్చెనో యెఱుంగ." థర్మజ. 59. 17.
కాలు త్రొక్కికొను
- తొందరపడు.
- "కాలు త్రొక్కికొనుచు గళవళపడుచున్న, నెన్నొ యట్టిస్థితులు మున్ను కన్న, వార లౌట నా యొయారులు వాడక, పదిలపఱిచి సరగ స్వాంతములను." భద్రావత్య. 2.
- "ఏదో చేయాలి గానీ ఊరికే కాళ్లు త్రొక్కుకుంటూ కూచుంటే ఏం లాభం?" వా.
కాలు దన్ను
- కాలూని నిలుచు.
- "అచటికి వేగంబ యరుగక యిచట గా,ల్దన్ని యుండెడు నట్టి ధైర్యమెందు,గలదు. భార. మౌస. 97.
- "ఇట్లు వెఱచఱచి యవిసినకలంబు జనంబులు దీవి సేరినయట్లు కర్ణుం జేరి కాలు దన్ని నిలిచె." భార. కర్ణ. 3. 165.
కాలుదివిటీ మర్యాద
- రాచమర్యాదలలో ఒకటి.
- "ఆయనగారు కాలుదివిటీ మర్యాదలతో తీసుకొని వస్తే గానీ వచ్చేట్టు లేడు." వా.
- చూ. కాలుదివియ.
కాలుదివియ
- రాజులూ మొదలయినవారు పోతుండగా దివిటీలను వంగి పట్టుకొని ముందు నడుస్తుంటారు. అ దొక రాచ మర్యాద. అలా పట్టుకొనే దివిటీలను కాలుదివియ లంటారు. దీనినే కాలుదివిటీ