పుట:PadabhamdhaParijathamu.djvu/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలు____కాలు 459 కాలు____కాలు

కాలుచ్చు

  • పక్షులు మొదలగువాని కాళ్లకు చుట్టుకొనే వల, ఉరి.
  • "మిడిబోనుల గాలుచ్చుల, బడదోలియు బోగులోను పఱచియు లేళ్లన్, వడి గల జింకల నెల్లన్, బొడిచిరి..." యయా. 2. 19.

కాలు జారు

  • తప్పుదారి త్రొక్కు.
  • వ్యభిచరించు.
  • "ఆ పిల్ల ఎప్పుడో చిన్నతనంలో కాలు జారిం దని అంత నీచంగా చూడడం ఏం బాగ లేదు." వా.
  • "ఒకసారి కాలు జారితే ఇక ఆపుకోవటం కష్టం." వా.

కాలు తీసి పెట్టకుండా

  • చూ. కాలు క్రింద పెట్టకుండా.

కాలు త్రొక్కి కంకణం కట్టు

  • విధివిహితంగా పెండ్లి చేసుకొను. వివాహంలోని ఆచారంపై వచ్చిన పలుకుబడి.
  • "అంత నిర్బంధం చేయడానికి నీ వేం కాలు తొక్కి కంకణం కట్టావా? నా యిష్టం వచ్చినచోటికి నేను పోతాను." వా.
  • చూ. కాలు ద్రొక్కు.

కాలు త్రొక్కికొని వచ్చు

  • వెన్నంటి వచ్చు.
  • "మీకును మాకును నీ వైరం బెక్కడ నుండి కాలు త్రొక్కికొని వచ్చెనో యెఱుంగ." థర్మజ. 59. 17.

కాలు త్రొక్కికొను

  • తొందరపడు.
  • "కాలు త్రొక్కికొనుచు గళవళపడుచున్న, నెన్నొ యట్టిస్థితులు మున్ను కన్న, వార లౌట నా యొయారులు వాడక, పదిలపఱిచి సరగ స్వాంతములను." భద్రావత్య. 2.
  • "ఏదో చేయాలి గానీ ఊరికే కాళ్లు త్రొక్కుకుంటూ కూచుంటే ఏం లాభం?" వా.

కాలు దన్ను

  • కాలూని నిలుచు.
  • "అచటికి వేగంబ యరుగక యిచట గా,ల్దన్ని యుండెడు నట్టి ధైర్యమెందు,గలదు. భార. మౌస. 97.
  • "ఇట్లు వెఱచఱచి యవిసినకలంబు జనంబులు దీవి సేరినయట్లు కర్ణుం జేరి కాలు దన్ని నిలిచె." భార. కర్ణ. 3. 165.

కాలుదివిటీ మర్యాద

  • రాచమర్యాదలలో ఒకటి.
  • "ఆయనగారు కాలుదివిటీ మర్యాదలతో తీసుకొని వస్తే గానీ వచ్చేట్టు లేడు." వా.
  • చూ. కాలుదివియ.

కాలుదివియ

  • రాజులూ మొదలయినవారు పోతుండగా దివిటీలను వంగి పట్టుకొని ముందు నడుస్తుంటారు. అ దొక రాచ మర్యాద. అలా పట్టుకొనే దివిటీలను కాలుదివియ లంటారు. దీనినే కాలుదివిటీ