పుట:PadabhamdhaParijathamu.djvu/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉఱు____ఉఱ్ఱూ 222 ఉఱ్ఱూ____ఉలి

ఉఱుమనిపిడుగులు

  • ఉఱుము లుఱుమకయే పడిన పిడుగులు. అనగా పూర్వ సూచన లేకయే అనుట. పండితా. ద్వితీ. మహి. పుట. 9.

ఉఱ్ఱకట్టు

  • పశువులకు వేయు కాలి బందము.

ఉఱ్ఱట లూగు

  • ఉఱ్ఱూత లూగు.
  • "సి గ్గుఱ్ఱట లూగ..." కృష్ణ. శకుం. 2. 57.

ఉఱ్ఱట లూచు

  • ఉఱ్ఱూత లూగునట్లు చేయు.

ఉఱ్ఱట్లూగు

  • ఉఱ్ఱూత లూగు.
  • "బ్రహ్మాండభాండ ముఱ్ఱట్లూగన్." శశాం. 5. 36.
  • "వాడు పెండ్లి కావా లని ఉఱ్ఱట్లూగుతున్నాడు." వా.
  • చూ. ఉఱ్ఱట లూగు.

ఉఱ్ఱట్లూచు

  • చూ. ఉఱ్ఱట లూచు.

ఉఱ్ఱుతాడు

  • పశువులు మొదలయినవాని కాళ్లకు వేసేబందం.
  • "కుఱ్ఱల బట్టగ నుఱ్ఱుంద్రాళ్ళు వలదు, కుండ యొడ్డన బాలు నిండ గురియు." మై. రా. 1. 57.

ఉఱ్ఱూత లూగు

  • ఉఱ్ఱట లూగు.
  • "కోడెవయసుపాక ముఱ్ఱూత లూగెడు భార్యమీద,... మనసు చాలించి..." హంస. 5. 115.

ఉఱ్ఱూత లూపు

  • కదలించు.
  • "నిర్వక్రరథచక్ర నిష్ఠురగతు లనం తోరగస్వామి నుఱ్ఱూత లూప." రాధా. 5. 21.

ఉలఉల లాడు

  • దురద పెట్టు.
  • "దానికి ఎప్పుడూ నోరు ఉల ఉల లాడుతూ ఉంటుంది. ఏదో ఒకటి అనకుండా ఉండదు." వా.

ఉలారం గొడ్డు

  • పొగరెక్కిన గొడ్డు.

ఉలికిపడు

  • అదరిపడు. అకస్మాత్తుగా ఏదయినా విని నప్పుడో, కనినప్పుడో సంభ్రాంతి చెందు. విజయ. 3. 62..

ఉలికిపాటు

  • అదిరిపాటు.

ఉలిపికట్టె

  • పెడసరపు మనిషి.
  • "ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది ఇంకో దారి." సా.

ఉలిపిజంగెత

  • ఉలిపికట్టె వంటిది.
  • "ఉలిపి, జంగెత నీ వేల చనుదెంచి తిట్లు." పండితా. ప్రథ. దీక్షా. పుట. 149.