పుట:PadabhamdhaParijathamu.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉలి____ఉలు 223 ఉలు_____ఉల్ల

ఉలియాడు

  • పోగరతో లోహములమీద, కఱ్ఱలమీద చిత్రములు చిత్రించు.

ఉలివాడు

  • కదలు.
  • "కొమరొందు నవవిలాసముల కంబొమ లులి, వాడు చూపుడు గోల లగుచు దనర..." కళా. 2. 172.

ఉలివాళుల వాడు

  • సుండ్రుకొని పోవు.
  • "మీసలు గడ్డము, నులివాళులు వాడుచుండు నొందినభీతిన్." కుమా. 10. 101.
  • 'మీసాలు కాలిపోతాయి జాగ్రత్త' అని వాడుకలోనూ ఉంది.

ఉలివెచ్చ

  • గోరువెచ్చ.

ఉలుకబాఱు

  • వెలికి ప్రసరించు.
  • "ఒడలి తాంతులు పట్టు లే కులుకబాఱు, సన్న వలిపంపు బయ్యెద చౌకళించి." భాగ. 8. 363.

ఉలుప నించినకై వడి

  • కానుకగా వచ్చిన పదార్థములు ఉంచినట్లు; ప్రదర్శన ముంచినట్లు.
  • "ఒలుపు బప్పు మొదల్గొని తెచ్చి యన్నియున్, వేఱుగ నింటిలో నులుప నించినకైవడి నుంచె." శుక. 3. 189.

ఉలుప పట్టు

  • కానుక లిడు. పాండు. 5. 238.

ఉలుపా యొనగూర్చు

  • నజరానా పెట్టు; బహుమతులు కానుకలు ఇచ్చు.
  • "రాజురాక కులుపా యొనగూర్చిన యట్లు...." కళా. 6. 134.

ఉలుపా లొనరించు

  • కానుక లిచ్చు. ఉల్ఫా అనే పదంనుండి వచ్చి యుండవచ్చును.
  • "విశేషవస్తు సంభావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబు జేరినన్." శుక. 1. 399.

ఉలువకట్టు

  • ఉలవ లుడికించి చేసిన చారు.
  • "నాలుగు రోజులు నీవు ఉలవకట్టు వేసుకొంటే నీశైత్యం వదలి పోతుంది." వా.

ఉల్లకుట్టుమాటలు

  • ఎత్తిపొడుపు మాటలు.
  • "సమరమునకు బురికొల్పుచు, మముదలచిన నుల్లకుట్టుమాటల దచ్చి,త్తము లుడికించుచు బాండవ, సమితిం గడగించువా రచట నెవ్వ రొకో!" భార. ఉద్యో. 2. 242.
  • "ఈ ఉల్లకుట్టు మాటలతోనే ఆవిడ అందరినీ ద్వేషం చేసుకుంటుంది." వా.
  • రూ. ఉల్లికుట్టుమాటలు.

ఉల్లము పల్లవించు

  • సంతోషము కలుగు.