పుట:PadabhamdhaParijathamu.djvu/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉభ_____ఉమ్మె 220 ఉమ్మె_____ఉరి

ఉభయఖర్చులు

  • పెండ్లిలో ఆడ పెండ్లి వారి, మొగపెండ్లివారి ఖర్చులు రెండూ.
  • "ఉభయఖర్చులూ మేమేభరిస్తా మని చెప్పాం కదా!" వా.

ఉమేజువారి పని

  • పై తనిఖీ చేయుపని.
  • "ఉమేజువారీ పని చేయడాని కేం? ఎవరైనా చేస్తారు." వా.

ఉమ్మాయజగ్గాయలు

  • య: కశ్చనలు. వాడూ, వీడూ; పే రెత్తి చెప్పదగినవారు కారు అనుట.

ఉమ్మాయముత్యము

  • మాయముత్యము.

ఉమ్మెత్తకాయకు చిలుక పొంచి యున్నట్లు

  • అనవసర మైనఆశతో వేచి ఉన్నట్లు. ఉమ్మెత్త విషఫలం. అది చిలుక తినుట కెలాగూ పనికి రాదు.
  • "రాతికి సరి వచ్చురా వీని మనసు, కరగబో దుమ్మెత్తకాయకు జిలుక, పొరసినవిధ మాయె బో తనవలపు." సారం. 1. 551.

ఉమ్మెత్తకాయ తిన్న పొలుపు

  • వెఱ్ఱి యెత్తినట్లు. ఉమ్మెత్తకాయలు తింటే పిచ్చిపట్టుతుం దని మనవారి నమ్మకం.
  • "కంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న, పొలుపు సారెకు దెల్పు న ప్పుడమి వేల్పు." శుక. 2. 459.

ఉమ్మెత్తకాయలు తిను

  • వెఱ్ఱెత్తు. ఉమ్మెతకాయలు తింటే పిచ్చి పడుతుం దని అంటారు. అందుమీద వచ్చిన పలుకుబడి.
  • "ఉమ్మెత్తకాయలు తిన్న యదియొ, మరులుకొన్నదియో మున్, మతి తప్పి నదియో." పండితా. దీక్షా. ప్రథమ. 115 పు.

ఉయ్యల లూగు

  • సందిగ్ధావస్థలో ఉండు.
  • "...భీతిచే నుయ్యెల లూగుప్రాణముల నోర్వక చీరెద వీట జూచితే..." హంస. 3. 45.

ఉయ్యాలో జంపాలో

  • ఊచునప్పుడు అను ఊతపదం.
  • "జోలల్ పాడిరి యమృతపు, జాలుం జోకొట్టజాలు సరసపు జూపుల్, డోలాయమానముగ ను,య్యాలో జంపాలో యనుచు నాలోలాక్షుల్." సారం. 1. 48.

ఉరిగోల

  • ఉరివేయు కోల.

ఉరిగోల పులుగు

  • ఉరిలో చిక్కినపక్షి. బాధ పడునది.