పుట:PadabhamdhaParijathamu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంత_____ఇంత 143 ఇంత_____ఇంత

ఇంతనాటినుండి

  • చిన్న తనమునుండి.
  • "ఏ నింతనాటినుండియు మానవతులలోన నింత మానవతిని నై...." శుక. 1. 134.
  • "వాడు ఇంతవాడుగా ఉన్నప్పుడు చూచాను."
  • "వాణ్ణి ఇంతనాటినుంచే నెఱుగుదును."
  • "ఆ పిల్ల యింతనాటినుంచే మాటకారి." వా.

ఇంతనె ముగి సెనే?

  • ఇంతలోనే అయి పోయిందా? అయి పోలేదు అనుట.
  • "ప్రభావతి వివర్ణ మగువదనముతో, గనుపట్టుడు నింతనె ముగి, సినె కార్యం బేల యింత చింతిల ననుచున్." ప్రభా. 3. 92.

ఇంత పాటులు పడి

  • ఇంత అవస్థ పడి.
  • "ఇంత పాట్లను బడి కన్న యీ మిత్ర మహిమకున్..." కళా. 3. 108.
  • "ఇన్ని పాట్లు పడి వీళ్లను సాకితే పెద్దవాళ్లు అయ్యాక నన్ను ఏం చేస్తారో యేమో?" వా.
  • రూ. ఇన్నిపాట్లు పడి.

ఇంత పిలిచి పెట్టు

  • ఆదరించు.
  • రామచం. 10.
  • "ఎదురుగ నే ఉంటాను గదా! ఆవిడ యింత పిలిచిపెట్టిన పాపాన పోలేదు." వా.

ఇంత మసి మోవక

  • ఇంత దుమ్ము కొట్టక.
  • "వారిలో మొగ దగువాని కింత మసి మోవక త్రుంగుట యెట్లు సైన్యముల్." జైమి. 2. 43.
  • 'వాడు ని న్నన్నిమాట లని అంత అవమానం చేస్తే వాడి మొహాన ఇంత మసికొట్ట కుండా ను వ్వెట్లా వచ్చావు?' వంటి పలుకుబడిలలో కానవచ్చే భాగమే యిది.

ఇంతమాత్ర

  • చాల స్వల్ప మనుట.
  • "ఇంతమాత్ర సుఖంబున కేల...." దశా. 3. 90.
  • ఈపాటి ఈమాత్రం అని కూడా నేటి అలవాటు.
  • "ఇంతమాత్రానికే అంత మిడిసిపడితే ఎలానే." వా.

ఇంతమాత్రము

  • చూ. ఇంతపట్టు.

ఇంతమాత్రాన

  • ఇంతమాత్రానికే.
  • "నీ కింతమాత్రాన విన్నంబడ నేల పోదు నిదె." పారి. 4. 62.

ఇంతమాత్రము ఎఱుగంగ లేనా?

  • ఇంతమాత్రము తెలియదా?
  • ఏ కొంతో తనకు తెలుసు ననుట.
  • "మీ సేవచేయుచు నింతమాత్రము నెఱుంగంగ లేన...." కళా. 5. 45.
  • "నే నిన్నాళ్లనుంచీ పత్రికలు చదువుతున్నాను. ఎంత రైతు నైనా హిట్లరు