పుట:PadabhamdhaParijathamu.djvu/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంత_____ఇంత 142 ఇంత_____ఇంత

ఇంతకు దెచ్చెను

  • ఇంత దు:ఖస్థితికి కారణ మయ్యెను.
  • "తా జెప్పుచదువు లింతకు దెచ్చె గా యంచు, మామ యే మన లేక మోము వంచు." శుక. 3. 486.

ఇంతకు నంత అయి అంతకు నింత అయి

  • 'అణోరణీయాన్ మహతో మహీయాన్‌' అన్న దాని కిది ప్రతిరూపము.
  • చిన్నలో చిన్న పెద్దలో పెద్ద అయి అనుట.
  • పాండు. 5. 51.

ఇంత కెత్తికొన్నాడు, ఇంకెంత కెత్తికో నున్నాడో?

  • ఇంత చేసినవాడు ఇం కెంత చేయ నున్నాడో?
  • "ఇట్లింత, కెత్తికొన్నా డింక నిట మీద నెంత, కెత్తికో నున్నాడో?' బస. 5. 135.

ఇంత చేయు

  • ఇంత పని చేయు; చెప్పరానంత చెరుపు చేయు.
  • "అతివ యెవ్వతో యింత, చేసె ననుచు మమ్ము జెండు దొలుత." ప్రభా. 1. 134.
  • "అది వచ్చి యింత చేసింది." వా.
  • ఆపల్కు ఇంత చేసెను అన్నప్పుడు.
  • ఆమాట ఇంత ఉపద్రవము తెచ్చినది అని భావం.
  • "హృదయమున నిల్పి యాపలు కింత సేసె, ననుచు..." కళా. 3. 220.
  • "అప్పు డెప్పుడో చూతాము లే అన్నాడు. ఆ మాట ఇంత చేసింది. గొంతుకు పట్టుకుంది." వా.

ఇంత టంతట పొంచి యుండు

  • అక్కడక్కడ దగ్గరలో దాగి యుండు.
  • "దాని చెలు లింతటంతట బొంచి యుండ..." కళా. 4. 61.

ఇంతట నంతట

  • సామాన్యంగా ; ఊఱకే.
  • "ఇంతుల సేచు పాతక మ దింతట నంతట బోదు-" వసు. 4. 28.
  • "ఇంతట్లో అంతట్లో తీరే కష్టాలు కావమ్మా యివి!" వా.

ఇంతటిలో పతి పాఱిపోవడు

  • ఇంతలోపల అయ్యే కార్య మేమీ చెడదు అనుటలో ఉపయోగిస్తారు. ఇది ఎన్నో వాక్యాలలో కనబడుతుంది - 'ఇంతట్లో ఆ వచ్చినవా డేమీ పారిపోడు లేవే?' 'తల దువ్వుకోకపోతే ఆ వచ్చిన వాడు (మగడు) పారిపోతాడా?' అని వయ సయినపిల్ల లను హాస్యం చేస్తారు.
  • "ఇందుల కొక్క గాథ గల దింతటిలో బతి పాఱిపోవడో యిందునిభాననా! వినుము..." శుక. 2. 99.