పుట:PadabhamdhaParijathamu.djvu/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇంటి_____ఇండె 141 ఇండ్ల_____ఇంత

ఇంటివేల్పు

 • కులదైవము.
 • చూ. ఇలవేల్పు.

ఇంటిశుద్ధి ఇల్లాలిశుద్ధి

 • ఇల్లాలి పరిశుభ్రత యింటి పరిశుభ్రరవల్లనే తెలియుననుట.
 • "ఇంటిశుద్ధో యిల్లాలుశుద్ధో అన్నారు. ఆ అమ్మాయి యిల్లు అద్దంలాగా పెట్టుకుంటుంది." వా.

ఇంటిసాలు

 • ఇలువడి ; సంప్రదాయం.
 • "వాళ్ల యింటిసాలు మంచిది కాదు." వా.

ఇంట్రపడు

 • సమ్మర్ద మగు.
 • "ఇంట్రపడ కుండగా నిల్పె నెడము లిచ్చె." హరి. ఉ. 9. 144.
 • చూ. ఇంట్ర మగు.

ఇంట్ర మగు

 • సందడి యగు.
 • "ఎదురుగా నేగుదెంచుచో నింట్రమయ్యె, బెండ్లి యిరువంక చుట్టంపు బెద్దలకును." నైష. 6. 84.
 • చూ. ఇంట్రపడు.

ఇండె గట్టెడిది

 • పూమాల గట్టునది.
 • ఇండై, తమిళం - ఇండె, కన్నడం.

ఇండె వాయు

 • చీలు.

ఇండెవాఱు

 • బీటలువాఱు.

ఇండ్ల నెత్తినదీపశిఖలు

 • ఇండ్లపై నిలిపినదీపాలు.
 • "వెలది యిచ్చటి సంపెంగ విరులు గహన, దేవతలయిండ్ల నెత్తినదీపశిఖలు." మను. 3. 76.

ఇంత అంత యని

 • ఇంతుంది అంతుంది అని - చెప్ప లేము. అనగా అత్యధిక మనుట.
 • "నలుగడ నింత యంత యని నాలుక జెప్పగ బెద్ద..." కుమా. 11. 15.

ఇంత అంత అని పేర్కొనరాదు

 • చెప్ప లేనంత యెక్కువ అనుట.
 • "ప్రేమ మ దింత యంత యని పేర్కొన రాదు." విజయ. 1. 189.

ఇంతగా నోచితి

 • నేను చేసుకొన్న పనులకు ఫలిత మిట్లు పరిణమించినది. అనగా నా కర్మ యిలా కాలింది అని నేడు అనడం వంటిది.
 • "ఇంతగా నోచితి నింక నెట్టివి కనుం గొన నెమ్మెయి నున్న దాననో." పారి. 1. 90.

ఇంత గిల్లి పెట్టు

 • కాస్త తుంచి యిచ్చు.
 • రామచం. 46.
 • "ఎదురుగా పిల్లవాడు ఉంటే యింత గిల్లి పెట్ట నైనా పెట్టకుండా వాడు గారె లన్నీ తినేశాడు." వా.