పుట:PadabhamdhaParijathamu.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది సర్వసమగ్రమూ, స్వయంసంపూర్ణమూ అని చెప్పడం లేదు. అలా ఒక్క విడతలో బయట పడవేసే వీలున్న పని కా దిది.

ఇది చూచినవారు తా మిందులో చేర లే దని తోచిన వానిని దయతో తెలియజేస్తే వినమ్రుల మై స్వీకరిస్తాము.

ఇదొకరి పని కాదు. భాషాసేవ పరమావధిగా మేం చేయగలిగినది చేశాము. ఇలాగే ఇంకా మేము వెలికి తీసుకొని రాగలవానినీ, తర్వాత తెలిస్తే వానినీ, మిగత పై వారు తెలిపేవానిని అన్నిటినీ ద్వితీయ ముద్రణంలో చేరుస్తాము.

అలా ఒకటి రెండు ముద్రణా లై తే కాని, ఒక రకమైన సమగ్రత రాదు. - అప్పటి కైనా వస్తే మాట !

ఏమైనా మా యీ కృషిని ఆంధ్రవిద్వల్లోకమూ, సహృదయజగత్తూ, జిజ్ఞాసువులూ తప్పక సానుభూతితో అర్థం చేసుకొనగల రనీ, అంచనా వేసుకొనగల రనీ, అభినందించగల రనీ ఆశిస్తున్నాము.

ఈ మహాప్రయత్నంలో ఎందరో మాకు తోడ్పడినారు.

ప్రాచీనాధునిక గ్రంథసంచయంలోనుండి కొన్ని కావ్యాదులను చదివి వానిలో ఉన్న వానిని వేఱుగా ఎత్తి వ్రాసి యిచ్చుటలో మాకు తోడ్పడిన మిత్రులు వీరు. శ్రీగన్నవరపు సుబ్బరామయ్య; శ్రీ బులుసు వెంకటరమణయ్య; శ్రీ రావూరి దొరస్వామి శర్మ; శ్రీ తిరుమల రామచంద్ర; శ్రీ జాస్తి జగన్నాథం; శ్రీ యామిజాల పద్మనాభస్వామి.

అట్లే నుడికారాలు, సామెతలు వగైరాల సేకరణలో ప్రభుత్వనియమితు లై కృషి చేసిన శ్రీ సంపత్ రాఘవాచార్యులు తాము వ్రాసి ఉంచినవానిని మాకు పంపారు.

వా రందఱికీ కృతజ్ఞులము.

మే మిందులో ఉదహరించిన గ్రంథాలే కాక ఇం కెన్నో పరిశీలించాము. ఏదో ఒకదానినుండి ప్రయోగ మిస్తే సరిపోవును గనుక, చదివినవానిలోఎక్కువపాలు