పుట:PadabhamdhaParijathamu.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ట_____అష్టా 102 అష్టా_____అష్టా

అష్టనీరాంజనములు

  • ఎనిమిది అర్చనలు.
  • దర్శన, అవసర, మజ్జన, మాంగల్య, శృంగార, మహా, ఆనంద, అసంఖ్యాత నీరాంజనములు.
  • పండితా. ప్రథ. దీక్షా. పుట. 189.

అష్టవిధవధలు

  • ఎనిమిదిరకా లైన చంపుటలు.

అష్ట శోభనములు

  • అష్టవిధములయిన మంగళ కార్యములు; అలంకారాదులు.
  • "తన పురంబునం దష్ట శోభనంబులు దేవగృహంబులయందు విశేష పూజలు సేయించె."
  • భార. అర. 2. 221.

అష్టాంగ మెఱగి

  • అష్టాంగములు తాకునట్లు నేలపై సాగిలపడి, సాష్టాంగ పడి.
  • "ఆ లలనకు నత డష్టాంగ మెఱగి." బస. 6. ఆ. 150. పుట.

అష్టాదశ పురాణాలు

  • పదు నెనిమిది పురాణాలు.
  • మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మవైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు.

          "మద్వయం భద్వయం చైవ
            బ్రత్రయం వచతుష్టయం
           అనాపలింగ కూస్కాని
           పురాణాని పృథక్ పృథక్." చా.

అష్టాదశవర్ణనలు

  • నగరము, సముద్రము, ఋతువు, చంద్రోదయము, సూర్యోదయము, ఉద్యానము, సలిలక్రీడ, మధుపానము, రతోత్సవము, విప్రలంభము, వివాహము, పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతము, ప్రయాణము, నాయకాభ్యుదయము, శైలము, యుద్ధము - వీని వర్ణనలు.

అష్టాదశవర్ణాలు

  • పదు నెన్మిది కులాలు.
  • బస. 7 ఆ. 180 పుట.

అష్టాదశవిద్యలు

  • పదునెనిమిది విద్యలు.
  • చతుర్దశవిద్యలు, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వము, అర్థ శాస్త్రము కలిసి పదునెనిమిది.

అష్టావక్రుడు

  • వట్టి వక్రబుద్ధి అనే అర్థంలో ఉపయోగిస్తారు.