పుట:PadabhamdhaParijathamu.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టా____అస 103 అస____అస

  • ఇది ఆసలు ఒక ఋషి పేరే అయినా తరువాత ఈ యర్థంలోనే వాడుకలో నిలిచింది.
  • "వాడు వట్టి అష్టావక్రుడు." వా.

అష్టావక్రంగా.

  • పాడుగా.
  • "వా డే పని చేసినా అష్టావక్రంగా ఉంటుంది." వా.

అష్టోత్తరశతనామావళి జపించు

  • స్తోత్రపాఠంచేయు
  • నూట యెనిమిది పేర్లతో దేవతలను పూజించడం అలవాటు.
  • "వాడు రోజూ వెళ్లి వాడిదగ్గఱ అష్టోత్తరశతనామావళి జపిస్తుంటాడు." వా.

అసంబద్ధ ప్రలాపం.

  • అప్రస్తుతప్రసంగం.
  • "వాని వన్నీ అసంబద్ధ ప్రలాపాలు." వా.
  • చూ. అప్రస్తుతప్రసంగం.

అసడ్డమాటలు

  • అడ్డుమాటలు.
  • నేటికీ రాయలసీమలో 'ఏ పని చేస్తా మన్నా అన్నీ అసడ్డాలే. ఏదైనా మంచిపని చేస్తా మంటే లక్ష అసడ్డాలు' అని ప్రచురంగా వినబడుతుంది.
  • నిరసనవాక్యము అని వావిళ్ల లోనూ, అశ్రద్ధ, ఉపేక్ష,, తృణీకారము, తిరస్కారము అని సూ. ని. లోనూ, అసడ్డ అనేమాట కిచ్చిన అర్థాలు సరి కావు.
  • "సరకు సేయ వను చసడ్డ మాటలు గొన్ని యాడినంత నేమి."
  • భార. శాంతి. 4. 426.

అసమర్థ దుర్జనత్వం

  • చేత గాని దుష్టత.
  • వాడు చెడ్డవాడే కాని చెడుగు చేసే శక్తి లేదు అనేపట్ల ఉపయోగిస్తారు.
  • "వా డేదో న నీపుస్తకం రాయ మన్నారని ఊరికే యెత్తిపోసుకుంటున్నా డట. పోనీ అది ఆపగలడా? అదీ చేతకాదు. ఇదే అసమర్థ దుర్జనత్వం అంటే." వా.

అసమీక్ష్యకారి

  • ఆలోచింపక పని చేయు వాడు, దూరదృష్టి లేనివాడు.

అసలార

  • ఎసలార - బాగుగా ఒప్పిదముగా.
  • "అసలార మాయింట నారగించినను బసవనమంత్రి ఏ బ్రదుకుదు ననిన."
  • బస. 7 ఆ. 204 పుట.

అసలుకొను

  • అలముకొను.
  • "ఒడల నసలుకొనునెత్తురు గడిగి." జైమి. 6. 128.

అసలుకొల్పు

  • అలంకరించు.
  • "మసిబొట్టు బోనాన నసలు కొల్పిన కన్ను." క్రీడా. పు. 45.