పుట:PadabhamdhaParijathamu.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవ్వ____అశ్రు 101 అశ్మా_____అష్ట

అవ్వల నడుగు వెట్టు

  • నిర్బంధించుటలో ఉపయోగించుపలుకుబడి.
  • ఈ పని చేసి కానీ కదల వీలు లే దనుట.
  • "అర్థమిప్పించి యవ్వల నడుగు వెట్టు." శుక. 3 ఆ. 40 ప.
  • "ఆ డబ్బు అక్కడ పెట్టి అవతలికి అడుగుపెట్టు." వా.
  • "ఇందులో సంతకం పెట్టి కాని అవతలికి అడుగు పెట్టడానికి వీలు లేదు." వా.

అవ్వలికించుకొను

  • తొలగించు, అవ్వలికి త్రోయు.
  • ".....యుముక నవ్వలికించికొని." దశకు. 10. 105.

అవ్వలిమో మగు

  • మాఱుమో మగు.
  • "నివ్వెఱ గందుచు మదిలో, నవ్వలిమో మయ్యె నప్పు డనిరుద్ధుండన్." ఉషా. 3. 41.

అవ్వలిమో మివ్వల యగు

  • అటునుండి యిటు తిరుగు.
  • "తెర దీసి యాసలతో దృష్టుంచి చూచిన చూపు వరుస నవ్వలిమో మివ్వ లైన నవ్వు."
  • తాళ్ల. సం. 3. 182.

అశక్తదౌర్జన్యం

  • చూ. అసమర్థదుర్జనత్వం.

అశ్రులు మీటు

  • గోటితో కన్నీరు తుడుచు.
  • "వదన మక్కున గృపతో, నొత్తి మొగ మెత్తి యశ్రులు, మెత్తన గొన గోర బాఱ మీటుచు నుండెన్."
  • మను. 3. 137.

అశ్మా చ మే....

  • వాడిదగ్గర ఏమున్నది మన్ను - దుమ్ము అనే అర్థంలో ఉపయోగించే వైదిక పరిభాష.
  • 'అశ్మాచ మే మృత్తికాచమే' అన్న చమకంలోని మంత్రంపై వచ్చినపలుకుబడి.
  • "వాడిదగ్గర యేముంది? అశ్మాచమే." వా.
  • "అశ్మాచమే మృత్తికాచమే." చమకం.

అశ్రుతర్పణం

  • జలాంజలి.
  • తిలజలతర్పణము కాక అశ్రు తర్పణము కూడా యిటీవల వాడుకలోనికి వచ్చినది.

అష్టకష్టాలు పడు

  • అన్నివిధము లయినబాధలు పడు.
  • దాస్యం, పేదతనం, భార్యా హీనత, ఆదరవు లేకపోవడం, అడుక్కోవడం, ఇవ్వలేక పోవుట, అప్పుల పాలు గావడం, దేశాటనం అన్నవి అష్టకష్టాలుగా పరిగణితము లయినవి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "నేను అష్ట కష్టాలు పడి ఆ పిల్లను సాకాను." వా.