పుట:PadabhamdhaParijathamu.djvu/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అవి_____అవు 100 అవు_____అవ్వ

అవినాభావసంబంధం

 • ఎల్ల ప్పుడూ కలిసి యుండుట, విడదీయరాని సంబంధ మనుట.
 • "కావ్యానికీ, రసానికీ యెప్పుడూ అవినాభావసంబంధం ఉంటుంది." వా.

అవును కాదు అను

 • ఎదురు చెప్పు.
 • "కలలో నైనను నీదు మాటలకు నౌగా దంచు మాఱాడుటల్, గలవో?" రాజగో. 1. 99.
 • "నీ మాట కెప్పు డైనా అవును కాదు అన్నానా?"
 • ""వాడు నీ వేం చెప్పినా అవును కాదు అనకుండా చేస్తాడు." వా.

అవు గాక

 • కానీ అనుట.
 • హర. 4. 39.

అవు గా దను

 • తిరస్కరించు, బదులు చెప్పు.
 • "హరివార మైతిమి మ మ్మవు గా ధనగ రాదు." తాళ్ల. సం. 6. 40.

అవుగాములు

 • మంచిచెడ్డలు. జం.
 • "నీవు చని యవుగాములు నిశ్చయించి, యాశ దెగ గోయు మదియ మత్ప్రాణరక్ష." ప్రభా. 3. 107.
 • చూ. ఔ గాములు.

అవుడుకఱచు

 • పెదవి కొఱుకు.
 • "గురివెంద జైత్రు డొందగ, గర మలుక న్మోవి యవుడు కఱచిన నును వా, తెరమీద గాననగు పలువరుస."
 • పారి. 3. 48.

అవురు దర్భ యగునె?

 • ఆకారసామ్య మున్న ప్పటికీ పవిత్రత అన్ని టా ఉండ దనుట.
 • వేమన. 80.

అవురుసవు రగు

 • మిక్కిలి శ్రమపడు.
 • "అవురుసవు రైరి గుజగుజ యైరి డస్సి రొల్ల బోయిరి వెగ్గిరి తల్ల డిలిరి." హరవి. 3. 10.

అవుల బుచ్చు

 • త్రోసిపుచ్చు, పోనాడు.
 • పండితా. ద్వితీ. మహి. పుట. 214.

అవులెమ్ము

 • ఔ లే.
 • "అవులెమ్మని యూఱడిలెన్ సుదంత." పారి. 1. 69.
 • చూ. అగు లెమ్ము.

అవ్వను పట్టుకొని వసంతా లాడు

 • అసమానులతో సరసాలకు దిగు.
 • "అత నేదో పురాణం చెప్పుకొనే ముసలాయన, ఆయనదగ్గర నీ పాండిత్యం వెలగ బెడతా వేమిటిరా? అవ్వను పట్టుకొని వసంతా లాడినట్లు!" వా.
 • చూ. అమ్మను పట్టి వసంతము చిమ్మి నట్టు.