పుట:Navanadhacharitra.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

41

బేరుకోనేల యా ◆ బింబోష్ఠి నిన్ను
వలవంతఁ జేపట్టి ◆ వదలకరతికి
బలవంతమునఁదీసి ◆ పైఁబడఁదివురుఁ
బరలోకభీతి నా ◆ పద్మాక్షి సరవి
జరగక విడనాడి ◆ చనుదెంచితేని
నృపునితో నొండు రెం ◆ [1]డును గాను జెప్పి
కపట మేర్పడఁబెట్టి ◆ కల్లతనంబు
నీమీఁద మోపుట ◆ నిక్కంబు వలదు
నామాట చేకొని ◆ నన్ను మన్నించి
తూలగించక [2]మోర ◆ త్రోపుఁదనంబు
చాలించు మనుడు నా ◆ సచివనందనుని
గనుఁగొని నిడువాలు ◆ కన్నులు కెంపు
సన నిట్టులనియె నా ◆ సారంగధరుఁడు
పోపొమ్ము చాలు నీ ◆ బుద్ధులు వట్టి
పాపంబు గట్టక ◆ పలుకులుమాని
నను నీవు పిన్నటి ◆ నాఁటనుండియును
మన సూఁదఁ గొలిచిన ◆ మందెమేలమునఁ
బలికితిగాని నా ◆ భావసంశుద్ధి
తలఁపనేరవు రవిఁ ◆ దఱుమునె తమము
నిప్పు[3]నుజెదలంటు ◆ నే నామనంబు
గప్పునే కామవి ◆ కారంబు లెందు
వామాక్షు లెటువంటి ◆ వారైననేమి
భూమీశ్వరుఁడు వేఁటఁ ◆ బోయిననేమి
మాతల్లి రత్నాంగి ◆ మాఱు చిత్రాంగి
పాతకంబనక నా ◆ పైఁ దప్పులెన్ని
పతితోడనేల కో ◆ పము పుట్టఁజెప్పు
నతఁ డేల ననుఁ బుత్రుఁ ◆ డనక దండించుఁ
జాలు నీపని శంక ◆ చయ్యనఁబోయి
వాలాయమునను బా ◆ ర్వముఁ గొనివత్తు
విడువిడుమని చేయి ◆ విడఁబాఱఁ దిగిచి

  1. 'నృపు' లోని 'నృ' అనుదాని యుచ్చారణము 'న్రు' గా వినఁబడుటచేఁ గాఁబోలు ‘ండు' యతిస్థానమున నుపయోగింపఁబడినది. ఇట్టివి యింకను గలవు. ఇటఁ 'రెంటి' యని సవరించినచో యతి సరిపడును.
  2. మోరు
  3. నిప్పునెంజదలంటు