పుట:Navanadhacharitra.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxvii

యుచునే యున్నది. అనేక లక్షణ గ్రంథములనుండి యేర్చికూర్చిన యుదాహరణములతోఁ గూడిన గ్రంథమీ 'లక్షణ దీపిక '.

“ఉదాహరణ రత్నాని లక్షణ గ్రన్థసన్ధిషు,
  సమాకృష్య సతాం భూత్యై వక్ష్యే లక్షణదీపికాం”.

అని చెప్పియున్నాఁడు. ఈ గ్రంథమునందలి విషయ సూచిక యిది:-

"వర్ణానాముద్భవఃపశ్చా ద్య్వక్తిసంఖ్యా తతఃపరం
 భూత బీజవిచారశ్చ తతోవర్ణగ్రహానపి
 ప్రయోగనిర్ణయన్తేషాం శుభాశుభ ఫలానిచ
 గణానాంచాభిధానాని స్వరూపాణ్యధిదేవతాః
 వర్ణ భేదగ్రహా స్తత్ర శుభాశుభ ఫలానిచ
 మిత్రామిత్ర విచారశ్చ నక్షత్రాణిచ రాశయః
 మృతవేళాగ్రహావస్థా మాతృకా పూజనక్రమః
 కర్తుః కారయితుశ్చైవ ప్రబన్ధానాం చ లక్షణం,
 వక్ష్యతే తత్ర సకలం మయా లక్షణవేదినా. "

ఇందు చమత్కారచంద్రిక, సాహిత్యచూడామణి, శారదాతిలకము, రూపావతారము, బృహజ్జాతకము, సాహిత్య చంద్రోదయము మొదలగు ననేకలక్షణగ్రంథములనుండి యా యా విషయములను గూర్చిన ప్రమాణ శ్లోకములు సంగ్రహింపఁ బడియున్నవి. గ్రంథాంతమున నీ శ్లోకము గలదు.

"ఏషా లక్షణ దీపికా విజయతే విద్వజ్జనానన్దినీ
 ఛందో వ్యాకరణాద్యనేక వివిధ గ్రంథప్రయోగాన్వితా
 గర్వాత్సర్వ కుతర్కకర్కశ కవిశ్రీవాసదాసాశ్రిత
 వ్యాళీ సత్కవిరాజకల్పలతికా కల్పాంతరస్థాయినీ”

ఇట్లు గౌరన విరచితములు మూఁడుగంథములుగలవని తెలియవచ్చుచున్నది. వీనిలో నెద్దానిలోను దక్కినవానిఁగూర్చి ప్రశంసింపకుండుటచే, వీని పౌర్వాపర్యమును గూర్చి తెలిసికొనుట కవకాశమే కలుగుట లేదు. తెలుఁగు రచనలు రెండింటిలో నీ నవనాథచరితము శాంతభిక్షావృత్తిరాయని ప్రేరణమున శ్రీశైల మల్లిఖార్జునున కంకిత మొనర్పఁబడిన ట్లిందు కలదు. కాని హరిశ్చంద ద్విపదలో నిట్టి విశేషము లేమియుఁ జెప్పఁబడియుండలేదు. మల్లి కార్జునదేవుని భ్రమరాంబికా మహాశక్తినిఁ గొలిచి, హేరంబునిఁ బొగడి, వారిజాసను రాణిఁ బ్రార్థించి, కాళిదాసాది కవులను దలఁచి:--